Cumin Water For Fat : ఉదయం పూట నిద్రలేవగానే చాలా మందికి నీటిని తాగే అలవాటు ఉంటుంది. కనీసం రెండున్నర నుండి మూడు లీరట్ల నీటిని ఉదయం పూట తాగాలని నిపుణులు చెబుతుంటారు. ఇలా తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామన్న సంగతి మనకు తెలిసిందే. ఉదయం పూట నీటిని తాగే అలవాటు ఉన్న వారు తేలికగా లీటర్ల కొద్ది నీటిని తాగేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి ఉదయం పూట నీటిని తాగాలంటే వికారంగా, వాంతి వచ్చినట్టుగా ఉంటుంది. చాలా మందికి నీటి రుచి తగ్గక తాగలేకపోతుంటారు.ఇలా ఉదయం పూట నీటిని తాగడం ఇష్టలేని వారు, నీటిని ఎక్కువగా తాగలేని వారు మంచి నీటికి బదులుగా జీరా నీటిని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నీటిలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల జీలకర్రను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా తయారు చేసుకున్న జీలకర్ర నీటిని ఉదయం పూట ఒకటిన్నర లీటర్ల మోతాదులో తాగాలి. ఈ విధంగా జీలకర్ర నీటిని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్రలో ఉండే థైమాల్ అనే రసాయన సమ్మేళనం జీర్ణశక్తిని మెరుగుపరచడానికి అవసరమయ్యే ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి.
గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. మెటబాలిజం రేటు పెరగడం వల్ల శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది. దీంతో మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే జీరా నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా జీలకర్ర నీరు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఉదయం పూటనే కాకుండా రోజంతా కూడా ఈ జీలకర్ర నీటిని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.