Onion For Hair Growth : చాలా మంది, జుట్టు ఈ మధ్య కాలంలో రాలిపోతోంది. జుట్టు రావడం తగ్గడానికి, చాలామంది రకరకాల మందుల్ని వాడుతున్నారు. అలానే, చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా వాడుతూ ఉంటారు. మీ జుట్టు కూడా, విపరీతంగా రాలుతుంది. జుట్టు రాలే సమస్య నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? ఇలా చేస్తే, జుట్టు రాలడం తగ్గిపోతుంది. దానితో పాటుగా చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం, తెల్ల జుట్టు వంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఈ సమస్య నుండి బయటపడడానికి, ఈ రెమిడి బాగా ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయల్ని తీసుకుని, తొక్క తీసేసి ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని, అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు, ఒక స్పూన్ కలోంజీ గింజలు, నాలుగు చుక్కలు టీ ట్రీ ఆయిల్, మూడు స్పూన్ల వరకు కలబంద గుజ్జు వేసి, మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి.
ఈ పేస్ట్ ని మీరు, జుట్టు కుదుళ్ల నుండి చివర్ల దాకా పట్టించి అరగంట పాటు అలా వదిలేసి, తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు లేదంటే మూడు సార్లు ఇలా చేసినట్లయితే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఉల్లిపాయలో పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి.
ఉల్లి జుట్టు రాలకుండా చూస్తుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. కరివేపాకు జుట్టుని రిపేర్ చేస్తుంది. జుట్టు దృఢంగా ఎదగడానికి సహాయం చేస్తుంది. కలోంజీ జుట్టు ఎదుగుదలకు సహాయపడడమే కాదు. తెల్ల జుట్టు ని కూడా నల్లగా మారుస్తుంది. టీ ట్రీ ఆయిల్ తో చుండ్రు సమస్య తగ్గుతుంది. తలలో దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కలబంద గుజ్జు జుట్టు రాలకుండా చూస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో మీరు జుట్టుని రాలిపోకుండా కాపాడుకోవచ్చు.