Apples : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ఆపిల్ ఒకటి. రోజుకు ఒక ఆపిల్ ను తింటే వైద్యున్ని వద్దకు వెళ్లే అవసరమే ఉండదని చెబుతూ ఉంటారు. ఆపిల్ మన ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. దాదాపు అన్ని కాలాల్లో ఆపిల్ మనకు విరివిరిగా లభిస్తుంది. ఆపిల్ ను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. నీరసంతో బాధపడే వారు ఆపిల్ ను తినడం వల్ల చక్కటి శక్తి లభించి హుషారుగా తయారవుతారు. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ఆపిల్ మనకు సహాయపడుతుంది.
బీపీ ని అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆపిల్ మనకు దోహదపడుతుంది. ఆపిల్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే బరువు తగ్గడంలో, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తి సమృద్ధిగా ఉండేలా చేయడంలో కూడా ఆపిల్ మనకు సహాయపడుతుంది. ఆపిల్ ను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఏదైనా కూడా సరైన పద్దతిలో తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఆపిల్ తిన్న తరువాత ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్ అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆపిల్ తిన్న తరువాత తినకూడని ఆ పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ ను తిన్న వెంటనే పెరుగును తినకూడదు. ఆపిల్ ను తిన్న వెంటనే పెరుగును తినడం వల్ల కఫం ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ ను తిన్న గంట లేదా రెండు గంటల తరువాత మాత్రమే పెరుగును తీసుకోవాలి. అలాగే ఆపిల్ ను తిన్న తరువాత పుల్లటి పండ్లను కానీ వాటితో చేసే ఊరగాయలను గానీ తినకూడదు. ఆపిల్ ను తిన్న రెండు గంటల తరువాత మాత్రమే వాటిని తీసుకోవాలి. ఆపిల్ ను తిన్న తరువాత పుల్లటి పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆపిల్ ను తిన్న వెంటనే నీటిని తాగకూడదు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల మనం తిన్న ఆపిల్ సరిగ్గా జీర్ణమవ్వదు. దానిలో ఉండే పోషకాలు మన శరీరానికి సరిగ్గా అందరు.
అలాగే వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదే విధంగా ఆపిల్ ను తీసుకున్న వెంటనే ముల్లంగిని తీసుకోకూడదు. ఆపిల్ ను తిన్న తరువాత ముల్లంగిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు, అలర్జీలు, దురదలు, దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ ను తిన్న తరువాత ఈ పదార్థాలను ఏ మాత్రం తీసుకోకూడదు. ఆపిల్ ను తిన్న వెంటనే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ లోని పోషకాలు మన శరీరానికి సక్రమంగా అందాలంటే ఆపిల్ ను తీసుకున్న గంట వరకు ఎటువంటి ఇతర పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.