Dates Milk : పాలు, ఖర్జూరాలు.. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండింటిలో ఉండే పోషకాలు మనకు ఒకేసారి లభిస్తాయి. దీని వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు మనకు పాలు, ఖర్జూరాల మిశ్రమం వల్ల కలుగుతాయి. ఒక గ్లాస్ పాలలో 4 ఖర్జూరాలను వేసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఆ పాలను మరిగించాలి. ఈ పాలను ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
1. పాలు, ఖర్జూరాలు కలిపిన మిశ్రమాన్ని తాగడం వల్ల అమితమైన బలం కలుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి బాగా లభిస్తుంది. రోజంతా నీరసంగా, నిస్సత్తువగా ఉందని భావించేవారు ఈ మిశ్రమాన్ని తాగితే శక్తి బాగా లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. జిమ్ చేసేవారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. అమితమైన బలాన్ని అందిస్తుంది.
2. పాలు, ఖర్జూరం మిశ్రమం తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు. దీని వల్ల సంతాన లోపం సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.
3. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. చర్మ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు కనిపించవు.
5. పాలు, ఖర్జూరాల మిశ్రమాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది.
6. ఈ మిశ్రమాన్ని తాగితే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారులు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి.
7. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రోజూ తాగుతుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
8. అలర్జీల సమస్య ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
పాలు, ఖర్జూరాల మిశ్రమాన్ని తాగితే అధికంగా బరువు పెరుగుతారు. కనుక అధిక బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగరాదు.