Drink For Belly Fat : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల పొట్ట, పిరుదులు, తొడలు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ పానీయం మన శరీరంలో మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గేలా చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం మూడు దాల్చిన చెక్క ముక్కలను, ఒక ఇంచు అల్లం ముక్కను, ఒక నిమ్మకాయను, ఒక టీ స్పూన్ జీలకర్రను, ఒక గ్లాస్ నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.
తరువాత అందులో జీలకర్రను, దాల్చిన చెక్క ముక్కలను వేసుకోవాలి. అలాగే అల్లాన్ని దంచుకుని వేసుకోవాలి. చివరగా నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తరువాత ఈ నీటిని వేడి చేయాలి. నిమ్మకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు 10 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువును తగ్గించే పానీయం తయారవుతుంది. ఈ పానీయాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజుకు రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకోవాలి. భోజనానికి గంట ముందు తీసుకోవడం కుదరని వారు భోజనం చేసిన రెండు గంటల తరువాత తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తీసుకున్న పది రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చే మార్పును గుర్తించవచ్చు. మంచి ఫలితాలను పొందాలనుకునే వారు దీనిని నెలరోజుల పాటు తీసుకోవడం మంచిది. ఈ పానీయాన్నీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. జీర్ణవ్యవస్థ మెరుగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ పానీయం తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అలాగే సహజ సిద్దమైనవి కూడా. కనుక ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.