Fennel Seeds : సోంపు గింజలు అంటే చాలా మంది భోజనం చేశాక నోటిని శుభ్రం చేసుకునేందుకు మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించేవి అనుకుంటారు. కానీ వాస్తవానికి అదే కాదు.. సోంపు గింజల వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. భోజనం చేశాక తప్పనిసరిగా 2 టీస్పూన్ల సోంపు గింజలను నమలాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. మరి వీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. సోంపు గింజలను నమలడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ ఉండదు. అజీర్ణం బాధించదు. మలబద్దకం అసలే బాధించదు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంద.
2. సోంపు గింజల్లో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. శరరీంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక భోజనం చేశాక తప్పకుండా సోంపు గింజలను తినడం అలవాటు చేసుకోవాలి.
3. సోంపు గింజలను తినడం వల్ల నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు, నోటి సమస్యలు తగ్గుతాయి. అవి ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.
4. జీర్ణాశయం, పేగుల్లో సూక్ష్మజీవులు ఉన్నవారు సోంపు గింజలను తింటే అవి నశిస్తాయి. అలాగే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బాలింతలు వీటిని తింటే పాలు బాగా పడతాయి.
5. ఆకలి లేని వారు, వాంతులు అవుతున్న వారు సోంపు గింజలను తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మైండ్ రిఫ్రెష్ అయి రిలాక్స్ అవుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.