Youthful Skin : వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే చర్మం ముడతలుగా మారుతుంటుంది. అయితే కొందరు ఎప్పుడు చూసినా వయస్సు ఏమాత్రం పెరిగినట్లు కనిపించదు. ఎల్లప్పుడూ యవ్వనంగా యువతలా కనిపిస్తారు. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మీరు కూడా అలా యవ్వనంగా కనిపించవచ్చు. ఎప్పుడూ యువతలా లుక్ ఉంటుంది. వృద్ధులుగా కనిపించరు. మరి అందుకు ఏం చేయాలంటే..
1. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. కనుక మీరు తీపి ప్రియులు అయితే చక్కెర, తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, నూనె వస్తువులను తినడం మానేయాలి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మంపై ముడతలు రావు.
2. పిండి పదార్థాలను అధికంగా తీసుకున్నా కూడా చర్మం త్వరగా ముడతలు పడుతుంది. కనుక వాటిని తక్కువగా తీసుకోవాలి. బదులుగా ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
3. నీటిని రోజూ తగినంత మోతాదులో తాగాలి. దీంతో చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. చర్మం సురక్షితంగా ఉంటుంది. ముడతలు కనిపించవు. యవ్వనంగా ఉంటారు.
4. ఒత్తిడి, ఆందోళన బాగా ఉంటే ముసలితనం త్వరగా వస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. కనుక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలి. అందుకు గాను రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. దీంతో వయస్సు మీద పడినా వృద్ధాప్య ఛాయలు రావు. యువతలా కనిపిస్తారు.
5. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, నట్స్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు.
6. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండే పప్పు దినుసులు, సోయా, చిక్కుడు, పచ్చి బఠానీలు వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
7. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. దీని వల్ల చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
8. అందాన్ని పెంపొందించేందుకు మార్కెట్‌లో లభించే రసాయనాలు కలిపిన క్రీములను వాడరాదు. సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. టమాటాలు, బొప్పాయి, అరటిపండు వంటి వాటితో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుని వాడవచ్చు. ఇవి అందాన్ని రెట్టింపు చేస్తాయి. క్రీముల వల్ల అందం పోతుంది.
9. రోజూ తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. నిద్ర వల్ల చర్మానికి మరమ్మత్తులు జరుగుతాయి. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడకుండా చూసుకోవచ్చు. చర్మం తాజాగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తుంది.
10. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అవకాడో, చేపలు, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.