ఈరోజుల్లో, చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లలకి కూడా కళ్లద్దాలు పడుతున్నాయి. ప్రస్తుతం, వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో చిన్నపిల్లలు కూడా కళ్లద్దాలని పెట్టుకుంటున్నారు. ఎక్కువసేపు మొబైల్ ఫోన్స్ చూడడం, టీవీలు చూడడం వలన, కంటి సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కళ్లద్దాలని పెట్టుకోవాల్సిన పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకసారి కళ్లద్దాలు పడ్డాయంటే, జీవితాంతం వాటిని పెట్టుకోవాల్సి వస్తుంది. మీ కళ్ళద్దాలని శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నారా..? అయితే చిట్కాలు తప్పనిసరిగా పాటించండి.
ఇక వీటిని అనుసరించడం వలన, శాశ్వతంగా కళ్లద్దాలని దూరం చేసుకోవచ్చు అని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా, మీరు ఈ పద్ధతుల్ని పాటించొచ్చు. కనీసం 20 రోజులు పాటు క్రమం తప్పకుండా, ఈ చిట్కాలు పాటించినట్లయితే కళ్లద్దాలు అవసరమే ఉండదు. అయితే, ఈ ప్రక్రియను చేసే టైంలో కళ్లద్దాలని పక్కన పెట్టేయాలి. మొదట కళ్ళని పదిసార్లు పైకి కిందకి కదిలించాలి. ఈ క్రమంలో కళ్ళని వీలైనంత కిందకి, పైకి కదిలించాలి.
ఆ తరువాత కళ్ళని వ్యతిరేక దిశలో తిప్పుతూ, కొన్ని రోజులు పాటు ఈ వ్యాయామాన్ని పాటించాలి. ప్రతిరోజు ఇలా చేస్తే, కొన్ని రోజులకి మీ దృష్టి సరిగా అవుతుంది. ముక్కు దగ్గర కళ్ళకి మధ్యలో బొటనవేలు ఉంచి, నెమ్మదిగా దృష్టిని కోల్పోకుండా, చేతిని బొటనవేలు ని దూరంగా కదిలించాలి.
ఆ టైంలో మీ దృష్టికి బొటని వేలుకొనపై ఉంచాలి. తర్వాత మళ్లీ బొటన వేలుని ముక్కు వైపుకి తీసుకురావాలి. ఇలా మీరు చేయడం వలన, దృష్టి సరిగ్గా ఉంటుంది. కీరా దోసకాయ ముక్కల్ని కట్ చేసి, 15 నిమిషాల పాటు కంటిమీదఉంచి విశ్రాంతి తీసుకోండి. ఇలా చేస్తే, ఉష్ణోగ్రత తగ్గి, కళ్ళ చుట్టుపక్కల మొత్తం చల్లగా మారుతుంది. కళ్ళని క్లీన్ చేస్తుంది. ఇలా చేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది.