Dates In The Morning : ఖర్జూరంతో కలిగే లాభాల గురించి, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది ఖర్జూరం పండ్లను రోజు తింటూ ఉంటారు. ముఖ్యంగా, ఉదయం పూట ఖర్జూరం పండ్లను తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అనారోగ్య సమస్యలకు దూరంగా కూడా ఉండవచ్చు. ఉదయాన్నే ఖర్జూరంతో రోజుని మొదలు పెడితే, ఎన్నో లాభాలని పొందవచ్చు. ఉదయాన్నే అల్పాహారాన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. అలానే, ఉదయం పూట తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారంతో రోజుని మొదలుపెడితే, అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి.
ప్రతిరోజు, ఆరోగ్యానికి మేలు చూసే అల్పాహారాన్ని తీసుకోవాలి. అల్పాహారంలో ఖర్జూరం పండ్లను వేసుకుని తీసుకోవాలి. ఉదయాన్నే మూడు లేదా నాలుగు ఖర్జూర పండ్లను తింటే, ఆరోగ్యానికి ఎంతో మంచి కలుగుతుంది. పాలు, స్మూతీలతో మిక్సీ పట్టుకుని తాగడం వలన కూడా ప్రయోజనాలని పొందవచ్చు. ఖర్జూరంలో ఐరన్, ఫోలేట్, ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియంతో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఎక్కువగా లభిస్తాయి. ఫినోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా, ఎంతో మేలు చేస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. రోగినిరోధక శక్తిని కూడా ఖర్జూరం పెంచుతాయి. ఖర్జూరం ని తీసుకోవడం వలన ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల నుండి కూడా దూరంగా ఉండవచ్చు. పెద్ద పేగు కి సంబంధించిన క్యాన్సర్లు రాకుండా కూడా చూసుకుంటాయి.
ఎముకల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. సాంద్రత పెరిగి దృఢంగా ఎముకలు మారుతాయి. వీటిలో ఉండే పీచు పదార్థాలు జీర్ణశక్తిని పెంచగలవు. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అదనపు క్యాలరీలు కరగడం కూడా జరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, రెగ్యులర్ గా ఖర్జూరం పండ్లను తీసుకోవడం మంచిది. ఇలా, ఉదయం పూట ఖర్జూరం తీసుకోవడం వలన ఇన్ని లాభాలని పొందవచ్చు.