Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

న‌వ్వుతోనూ చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది.. న‌వ్వ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

Editor by Editor
July 12, 2021
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

ప్ర‌స్తుతం అనేక మంది యాంత్రిక జీవితం గ‌డుపుతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే నిత్యం క‌నీసం ఒక పావుగంట పాటు అయినా న‌వ్వాల్సి ఉంటుంది. అవును.. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

health benefits of laughing

 

* నిత్యం 15 నిమిషాల పాటు న‌వ్వితే 2 గంట‌ల పాటు నిద్రించినంత లాభం క‌లుగుతుంది. అంటే 2 గంట‌ల పాటు నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఏవిధంగానైతే ఆరోగ్యం క‌లుగుతుందో.. అదే ఒక్క పావు గంట పాటు న‌వ్వితే.. స‌రిగ్గా అదేలాంటి లాభం క‌లుగుతుంద‌న్న‌మాట‌.

* న‌వ్వ‌డం వ‌ల్ల టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అదేంటీ.. షుగ‌ర్‌కు, న‌వ్వ‌డానికి సంబంధం ఏమిటి ? అని సందేహిస్తున్నారా ? అయితే సంబంధం ఉంది. ఎందుకంటే.. సుదీర్ఘ‌కాలం ఒత్తిడి వ‌ల్ల కూడా టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అందువ‌ల్ల నిత్యం న‌వ్వితే డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌వ‌చ్చు. అది లేని వారికి ఆ జ‌బ్బు రాకుండా ఉంటుంది.

* న‌వ్వ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త నాళాలు వెడ‌ల్పుగా మారుతాయి. దీంతో ర‌క్త‌స‌ర‌ఫ‌రాకు స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

* న‌వ్వ‌డం వ‌ల్ల ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉండ‌వ‌చ్చు. కార‌ణం.. న‌వ్వ‌డం వ‌ల్ల ముఖంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. ఇది ఆ ప్రాంతంలో చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువ‌ల్ల న‌వ్వ‌డం అనేది మ‌న‌కు య‌వ్వ‌నాన్ని అందిస్తుంది.

* నిత్యం అనేక ఒత్తిళ్ల మ‌ధ్య స‌త‌మ‌తం అయ్యే వారు క‌నీసం 15 నిమిషాల పాటు న‌వ్వితే చాలు.. ఒత్తిడి అంతా మ‌టుమాయం అవుతుంది. శ‌రీరంలో హార్మోన్లు స‌మ‌తుల్యంలో ఉంటాయి.

* న‌వ్వ‌డం వ‌ల్ల శ‌రీరంలో యాంటీ బాడీల సంఖ్య పెరుగుతుంది. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంద‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. క‌నుక నిత్యం న‌వ్వితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు.

* న‌వ్వ‌డం అనేది స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్‌గా ప‌నిచేస్తుంది. శ‌రీరంలో ఏ భాగంలో అయినా నొప్పి ఉన్న‌ప్పుడు కాసేపు న‌వ్వి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.

* న‌వ్వ‌డం వ‌ల్ల ఛాతి భాగం, జీర్ణాశ‌యం అన్నీ క‌దులుతాయి. దీంతో అంత‌ర్గ‌తంగా వాటికి వ్యాయామం అయిన‌ట్లు అవుతుంది. ఈ క్ర‌మంలో ఆయా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి.

* నిద్రలేమి స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం 15 నిమిషాల పాటు న‌వ్వితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ రాత్రి ప్ర‌శాంతంగా నిద్ర‌పోవ‌చ్చు.

* న‌వ్వ‌డం వ‌ల్ల శరీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. బాగా అల‌సిపోయాం అనుకున్న‌ప్పుడు కొంత సేపు న‌వ్వి చూడండి. శ‌క్తి అందిన‌ట్లు ఫీల‌వుతారు.

అయితే న‌వ్వ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి స‌రే.. మ‌రి న‌వ్వ‌డం ఎలా..? అంటే మీకు న‌చ్చిన హాస్య భ‌రిత క‌థ‌లు చ‌ద‌వ‌వ‌చ్చు. వీడియోలు చూడ‌వ‌చ్చు. జోకులు చ‌ద‌వ‌వ‌చ్చు. వేరే వాళ్ల ద్వారా జోకులు విన‌వ‌చ్చు. లేదా కొంద‌రు గుంపుగా ఉంటే సినిమాల్లోని జోకులు చెప్పుకుని న‌వ్వ‌వ‌చ్చు. ఎలా న‌వ్వినా స‌రే నిత్యం 15 నిమిషాల పాటు న‌వ్వ‌డం మొద‌లు పెట్టండి. దీంతో పైన తెలిపిన విధంగా అనేక లాభాలు క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: laughlaughingన‌వ్వ‌డంన‌వ్వు
Previous Post

పోషకాలు లోపిస్తే పలు లక్షణాలు కనిపిస్తాయి.. ఏయే పోషకాల లోపం ఉందో ఇలా సులభంగా కనిపెట్టండి..!

Next Post

చేమ దుంపలే కదా అని తీసిపారేయకండి.. వాటిని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
హెల్త్ టిప్స్

మ‌ఖ‌నాలను ఎలా తింటే మంచిది.. తెలుసుకోండి..!

July 20, 2025
హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గే మెడిసిన్ల‌ను వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

July 20, 2025
హెల్త్ టిప్స్

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిందా..? అయితే ఇలా చేయండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..!

July 20, 2025
హెల్త్ టిప్స్

పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?

July 20, 2025
హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారు క‌చ్చితంగా ఈ టిప్స్‌ను పాటించాల్సిందే..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.