Health Tips : మన శరీరంలోని అనేక వ్యవస్థల్లో జీర్ణవ్యవస్థ ఒకటి. ఇది మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరానికి అందిస్తుంది. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనకు శక్తి అంది మనం పనిచేయగలుగుతాము. అలాగే పోషకాలన్నింటినీ గ్రహించాక మిగిలిన వ్యర్థాలను కూడా జీర్ణవ్యవస్థే బయటకు పంపుతుంది. ఇలా జీర్ణవ్యవస్థ రోజూ చాలా పనిచేస్తుంది. అయితే చాలా మందికి జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఇవి అనారోగ్యాలను తెచ్చి పెడతాయి.
మన శరీరంలోని జీర్ణవ్యవస్థ మనం తినే ఆహారాలను దాదాపుగా 99 శాతం వరకు జీర్ణం చేస్తుంది. కానీ కొందరికి ఇలా జీర్ణం కాదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవదు. దీని వల్ల కూడా వ్యర్థాలు బాగా పెరిగిపోతాయి. ఇక మనం తినే ఆహారాల్లో ఉండే విషపదార్థాలు కూడా జీర్ణవ్యవస్థలో అలాగే ఉంటాయి. కనుక వీటన్నింటినీ రోజూ బయటకు పంపాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా ఇవి ప్రాణాంతక వ్యాధులను కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇక మన జీర్ణవ్యవస్థను రోజూ శుభ్రం చేసుకోవడం తేలికే. రోజూ పరగడుపునే నిద్ర లేవగానే కనీసం లీటర్‌న్నర నీళ్లను తాగాలి. గోరువెచ్చని నీళ్లు అయితే ఇంకా మంచిది. దీంతో చాలా వరకు జీర్ణవ్యవస్థ పొద్దున్నే శుభ్రం అవుతుంది. ఇలా వద్దనుకుంటే.. పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి అయినా సరే తాగాలి. ఇది అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ రోజూ శుభ్రంగా ఉంటుంది.
ఇక రోజంతా నీటిని అధికంగా తాగుతుండాలి. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు దోహదపడుతుంది. వ్యర్థాలను బయటకు పంపించేందుకు ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో క్యారెట్ లేదా కీరదోస లేదా బీట్‌రూట్ వంటి జ్యూస్‌లను తాగడం వల్ల కూడా శరీరం శుభ్రంగా మారుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు అన్నీ బయటకు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఈ విధంగా సూచనలు పాటిస్తే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.