Health Tips : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు, అజీర్తి, బద్దకం వంటి ఎన్నో సమస్యలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఒకే ఔషధం ద్వారా తగ్గించుకోవచ్చు. దాన్ని బయట ఎక్కడా విక్రయించరు. ఇంట్లోనే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఔషధాన్ని ఎలా తయారు చేయాలి.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. దాన్ని ఎలా తీసుకోవాలి.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, నల్ల జీలకర్ర- 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలను వేర్వేరుగా పెనంపై వేడి చేయాలి. తర్వాత ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి బాగా పొడిలా పట్టాలి. అలా వచ్చిన పొడిని గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి. ఇక ప్రతి రోజూ రాత్రి భోజనం తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఈ పొడిని కలిపి తాగాలి. దీనిని తాగిన తర్వాత ఇతర ఏ పదార్థాలను తినకూడదు. ఇలా తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.

పైప చెప్పిన విధంగా పొడిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని రకాల వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు ఉండవు. కంటి చూపు మెరుగు పడుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరగడంతోపాటు ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. అయితే ఈ మిశ్రమాన్ని వాడితే కొందరిలో విరేచనాలు అవుతాయి. లేదా అలర్జీలు కలగవచ్చు. అలా అయితే వెంటనే దీన్ని మానేయాలి. ఇక దీన్ని 3 నెలలు నిరంతరాయంగా వాడాలి. తరువాత 15 రోజుల పాటు విరామం ఇచ్చి మళ్లీ సమస్యలు తగ్గే వరకు వాడాలి. అలా వాడుతుంటే.. తప్పక ఫలితం కనిపిస్తుంది.