Hemoglobin Fruits : మన శరీరంలో ఎర్ర రక్తకణాల నుండి రక్తం తగిన మోగాదులో తయారవ్వాలంటే శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండడం చాలా అవసరం. హిమోగ్లోబిన్ స్థాయిలు సరిగ్గా ఉంటేనే రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది. శరీరంలో ఏ మాత్రం హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినా మనం రక్తహీనత బారిన పడాల్సి వస్తుంది. రక్తహీనత కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారాలను తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత మన దరి చేరకుండా ఉంటుంది. శరీరంలో సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. వీటిలో ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ ను శరీరం ఎక్కువగా గ్రహించడంలో కూడా ఆపిల్స్ మనకు సహాయపడతాయి. దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది. దానిమ్మపండ్లల్లో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాలు ఎక్కువగా తయారయ్యేలా చేయడంలో, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఇవి మనకు సహాయపడతాయి. అరటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. వీటిలో ఐరన్, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రక్త ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి మనకు సహాయపడతాయి.
నారింజ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆహారంలో ఉండే ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కూడా దోహదం చేస్తాయి. విటమిన్ సి మరియు ఐరన్ ఎక్కువగా ఉండే జామ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జామపండ్లను తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు ఎక్కువగా తయారవుతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. హిమోగ్లోబిన్ సంశ్లేషణను కూడా ఇవి ప్రోత్సహిస్తాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. కివీ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కివీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది.
దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇక ఆప్రికాట్ లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్త ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత రాకుండా ఉంటుంది. అలాగే శరీర పూర్తి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.