తేనె.. పెరుగు.. రెండూ ఆయుర్వేద పరంగా అద్భుతమైన పదార్థాలు అని చెప్పవచ్చు. రెండూ మనకు అనేక పోషకాలను అందిస్తాయి. ఇవి భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు తీసుకుని అందులో 2-3 టీస్పూన్ల తేనె కలుపుకుని మధ్యాహ్నం భోజనం చేశాక లేదా రాత్రి భోజనం చేశాక తినవచ్చు. శ్లేష్మం ఎక్కువగా వచ్చే సమస్య ఉన్నవారు దీన్ని మధ్యాహ్నం తీసుకోవడం మంచిది. ఇక ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పెరుగు, తేనె రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మనకు అనేక పోషకాలు ఒకేసారి అందుతాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ముఖ్యంగా తేనె ద్వారా మనకు ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు, ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అదే పెరుగుతో అయితే కాల్షియం, విటమిన్ బి12, పాస్ఫరస్, మెగ్నిషియం, రైబోఫ్లేవిన్, ప్రొబయోటిక్స్ లభిస్తాయి. దీని వల్ల శక్తి లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. పెరుగు, తేనె మిశ్రమాన్నితీసుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
3. ఈ మిశ్రమం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరం మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను ఎక్కువగా గ్రహించగలుగుతుంది.
4. ఈ మిశ్రమం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి.
ఈ మిశ్రమం వల్ల మంచి ఫలితాలు రావాలంటే స్వచ్ఛమైన పెరుగుతోపాటు ఆర్గానిక్ తేనెను వాడితే ఎంతో మంచిది.