Juices : ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఇంట్లో జ్యూసులని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారాన్ని తీసుకోవాలి. అందుకని పోషకాలతో కూడిన జ్యూస్‌లని చాలామంది తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా రెగ్యులర్ గా జ్యూస్‌లని తాగుతూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఆచరించడం మంచిది. ఇలా చేయడం వలన పోషకాలు బాగా అందుతాయి. జ్యూస్ తాగిన బెనిఫిట్ మీరు పొందవచ్చు.
చాలామంది ఉదయం పూట అల్పాహారం సమయంలో జ్యూస్ లని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా అలా తాగుతున్నట్లయితే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కొంతమంది జ్యూస్ పేరుతో షర్బత్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ తప్పు చేయకండి. తాజా పండ్లను మీరు జ్యూస్ లలో ఉపయోగించండి. ఎక్కువమంది బాగా తియ్యటి పండ్లని లేదంటే పంచదారని వాడుతుంటారు. అది ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగిస్తుంది.
ఎక్కువగా షుగర్ ని మీరు వేసుకుని తీసుకుంటే ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది. పంచదార లేదంటే తియ్యటి పండ్లు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. జ్యూస్ చేసేటప్పుడు కొన్ని కూరగాయల్ని కూడా మీరు వాడొచ్చు. ఆకుకూరలు, కాయగూరలతో జ్యూస్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బాగా ఎక్కువగా వాటిని వేసుకోవడం వలన రుచి పాడవుతుంది. చేదుగా ఉంటుంది.
కాబట్టి జ్యూస్ లని తీసుకునేటప్పుడు ఈ విషయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకొని వీటిని పాటించడం మంచిది. చాలామంది జ్యూస్ డిస్పెన్సెర్స్ ని వాడుతున్నారు. కానీ వీటిని వాడడం వలన పోషకాలు బాగా తగ్గిపోతాయి. బాగా వేడి వలన పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. కనుక.. వాటిని వాడేటప్పుడు బాగా వేడిగా అయ్యే వాటిని వాడకండి. ఎప్పుడూ కూడా జ్యూస్ ని ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోకూడదు.జ్యూస్ చేసిన వెంటనే తాగేయాలి.
ఉదయం తయారుచేసుకునే జ్యూస్ ని సాయంత్రం పూట తాగడం వలన పోషకాలు అందకపోవడమే కాకుండా అది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇంట్లో తయారు చేసిన జ్యూస్ ని కేవలం 24 గంటలు పాటు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. అయితే ఎప్పటికప్పుడు తీసుకుని ఫ్రెష్ గా తాగడమే మంచిది. జ్యూస్ ని తీసుకునేటప్పుడు విత్తనాలని మిక్స్ చేసుకోవద్దు. ఇలా జ్యూస్ లని తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది.