Proteins : ప్రోటీన్ విషయంలో, తప్పులు చేయకూడదు. మన ఆరోగ్యం బాగుండాలి అంటే, మనం తీసుకునే ఆహారం కూడా బాగుండాలి. మనం తీసుకునే ఆహారం బాగుంటేనే, మన ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఆహారం విషయంలో అసలు తప్పులు చేయకూడదు. ఆరోగ్యంగా ఉండడానికి, ప్రోటీన్ అనేది చాలా అవసరం. రోగ నిరోధక వ్యవస్థని ప్రోటీన్ మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పని చేస్తూ, ఒంట్లో మనకి జరిగే రసాయన చర్యలు కి తోడ్పడుతుంది. ప్రోటీన్ తీసుకోవడం వలన, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అలా అని ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు. హై ప్రోటీన్ డైట్ ని తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి.
ఇక, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనే విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకుందాం. అయితే, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అనేది వయస్సు, జెండర్ బట్టి ఉంటాయి. శారీరిక శ్రమ ఎక్కువ చేయని వారు, రోజుకి 10 కిలో గ్రాముల శరీర బరువుకి కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ప్రతిరోజు గంట పాటు వ్యాయామం చేస్తున్నట్లయితే, కిలో బరువుకి 1.2 నుండి 1.7 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాలి.
ప్రోటీన్ డైట్ ని తీసుకుంటే, బరువు తగ్గుతారని నిపుణులు చెప్పడం జరిగింది. అయితే, మన డైట్ లో మితిమీరి ప్రోటీన్ తీసుకుంటే, బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పడం జరిగింది.. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే, కొవ్వు బాడీలో స్టోర్ అయిపోతుంది. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. డైట్ లో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఆహారంలో తగినంత ఫైబర్ లేకుండా, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే, మలబద్ధకం వస్తుంది. మాంసం ఎక్కువ తింటే, బౌల్ మూమెంట్ సరిగ్గా జరగదు. కడుపు నొప్పి వంటివి కలుగుతాయి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. హై ప్రోటీన్ ఆహార పదార్థాలను తీసుకుంటే, క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వలన గుండె సమస్యలు కూడా తప్పవు. హృదయ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.