Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. జాగ్రత్త‌..!

Admin by Admin
February 15, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అనేది మనిషికి శారీరకంగా, మానసికంగా మంచిది. నేటి సమాజంలో చాలా మంది సమయానికి తినడం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారికి తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అయితే వీటి ప్రభావం ఆహారపు అలవాట్లపై పడుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు.. అంటే ఉదయాన్నే ఏవి పడితే అవి తినేస్తున్నాం. అయితే ఉదయాన్నేనిద్ర లేచిన వెంటనే కచ్చితంగా ఏదైనా తినాల్సిందే అని మనం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. అలా అని ఫాస్ట్ గా ఏదో ఒకటి తినేస్తే సరిపోతుందా అంటే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఖాళీ కడుపుతో మనం ఎలాంటి ఆహారం తింటున్నాం.. వాటితో ఎంత నష్టపోతున్నామో చూద్దామా.

మనలో చాలా మంది డైట్ లో భాగంగా పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే ఖాళీ కడుపుతో ఇవి తీసుకోవడం వల్ల క్లోమము మీద అధిక భారం పడుతుందట. అంతేకాక వీటిలోని ఫ్రక్టోస్ రూపంలో ఉన్న చ‌క్కెర కాలేయంపై చెడు ప్రభావం చూపుతుందట. ఫలితంగా డయాబెటీస్ లాంటివి అటాక్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామకాయ, నారింజ లాంటివి తినడం వల్ల అవి పేగులలో యాసిడ్ తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి ముందు ముందు అల్సర్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు తెచ్చిపెడతాయట. దీంతో పాటు వీటిలో ఉండే ఫ్రక్టోస్ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంద‌ట‌.

if you are taking these foods on empty stomach then know this

చాల మంది లేవగానే ఫ్రెష్ అయి కాఫీ తాగుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందట. కాఫీలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందట. యోగర్ట్ లాంటి ఫర్మింటెడ్ పాలతో చేసిన పదార్థాలలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్ పెంచి ఎసిడిటీకి దారి తీస్తుందట. కాబట్టి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండటం తప్పనిసరి. వెజిటేబుల్ సలాడ్స్ మధ్యాహ్నం భోజనం చేయడానికి సరైనవి. ఉదయాన్నే ఇవి తినడం వల్ల వీటిలోని ఫైబర్ కారణంగా కడుపుపై అధిక భారం పడుతుంది. ఫలితంగా పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. టమాటలోని ట్యానిక్ యాసిడ్ కడుపులో చికాకును పెంచుతుంది.

Tags: empty stomachfoods
Previous Post

వ్యాయామం చేయాలనే ఉంది.. కానీ వళ్లు బద్ధకం… అంటే ఎలా?

Next Post

నిజమా.. రోజూ వాకింగ్‌ చేస్తే ఇన్ని లాభాలుంటాయా..!

Related Posts

international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.