Earphones : ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మన జీవితంలో ఎలా భాగం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఫోన్లు లేకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు స్మార్ట్‌ఫోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అనేక పనులను చక్కబెట్టుకుంటున్నారు. దీంతోపాటు సోషల్ మీడియాలోనూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగే వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఫోన్లతోపాటు చెవుల్లో పెట్టుకుని వినే ఇయర్ ఫోన్స్ వాడకం కూడా ఎక్కువైంది. కానీ వీటిని రోజూ అదే పనిగా వాడేవారికి పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేమిటంటే..
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని 15 నిమిషాలకు మించి వాటితో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటే దాంతో వినికిడి సమస్యలు వస్తాయట. వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోయి చివరకు చెవుడు వస్తుందట. అలాగే మెదడు పనితీరు మందగిస్తుందట. యాక్టివ్‌గా ఉండలేరట. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందట. ఇక చాలా మంది ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండడం వల్ల అనేక ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని, అది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
కనుక పైన చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇయర్‌ఫోన్స్‌ను అధికంగా ఉపయోగించకూడదు. 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్‌ను వాడరాదు. అలా వాడాల్సి వస్తే మధ్య మధ్యలో కొంత బ్రేక్ ఇవ్వడం మంచిది. లేదంటే వినికిడి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీని వల్ల జీవితాంతం వినికిడి లోపంతో బాధ పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిందే.