నిమ్మకాయ రసం ఆరోగ్యానికి మంచిదని తెలుసుకదా.. అవును.. మంచిదే.. అదే నిమ్మరసం వల్ల అనారోగ్యాలు కూడా వస్తాయిని తెలుసా..? తెలియదంటారా..? బయటకు ఎక్కడికెళ్లినా జ్యూస్, మంచినీటికి బదులుగా లెమన్‌సోడా తాగుతుంటారు. అంతేకాదు దీక్ష చేసిన వారికి నిమ్మరసం నీటిని తాపిస్తుంటారు. అంతగా ప్రాధాన్యం ఇస్తారు ప్రజలు. కానీ, నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకోండి.
నిమ్మరసం తాగడానికి కాలంతో పనిలేదు. శీతాకాలం, వేసవికాలం ఏ సమయంలో అయినా నిమ్మరసం తాగేందుకు వెనుకాడరు. శరీరానికి తేమ అందించే విధంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బాడీ డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. ఇలా నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిసిన మనకు దీంతో ప్రమాదం ఉందని తెలియదు. రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే. ప్రధానంగా నిమ్మరసం మోతాదుకి మించి తీసుకుంటే 7 రకాల సమస్యలు వస్తాయి. ఇది తాగుతున్నప్పుడు ఏమనిపించదు. కొన్నిరోజుల తర్వాత ప్రభావం చూపుతుంది. సమస్యను గుర్తించి నిమ్మరసం అధికంగా తాగడాన్ని ఆపేయాలి. లేదని కంటిన్యూ చేస్తే ఆ ఆరురకాల సమస్యలూ తీవ్రమై వెంటాడుతాయి.
చాలామంది నిమ్మరసాన్ని డైరెక్ట్ తీసుకుంటారు. మోతాదుకి మించకుంటే ఏం కాదు. నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఎక్కువగా తీసుకుంటే దంతాలు దెబ్బతింటాయి. దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. దీంతో దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. నాలుకతో పళ్లను తడిమినప్పుడు గరుకుగా తగులుతుంటుంది. దీనికి ఇదే గుర్తు. వెంటనే నిమ్మరసం వాడకాన్ని అదుపులో ఉంచుకోవాలి.
కడుపులో గడబిడ :
మోతాదుకి మించితే ఏదైనా ప్రమాదమే.. నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే అల్సర్లు, అసిడిటీ సమస్యలు కడపునొప్పి వస్తాయి. పేరు కూడా తెలియని కొత్త రోగాలు సంతరించుకుంటాయి. దీనివల్ల పొట్టలో వేడి, వికారం, వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది.
లెమన్‌పై ప్రమాదకర వైరస్ :
నిమ్మరసం తాగడం వల్ల మానవ శరీరానికే కాదు వైరస్‌కు కూడా మంచే జరుగుతుంది. అందుకే నిమ్మకాయలపై ఎక్కువగా ఈ వైరస్ పేరుకొని ఉంటుంది. 21 రెస్టారెంట్లలో వాడుతున్న నిమ్మకాయల్ని టెస్ట చేయగా 70 శాతం నిమ్మకాయలపై ఇ-కోలి లాంటి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వైరస్ వల్ల వాంతులు, డయేరియా వంటివి వస్తున్నట్లు తేలింది. అందువల్ల నిమ్మకాయ ముక్కల్ని నీటిలో వేసి ఆ నీటిని తాగడం కంటే నిమ్మకాయ రసాన్ని మాత్రమే నీటిలో వేసి ఆ నీటిని తాగడం బెటర్.
మైగ్రేన్ వచ్చే ప్రమాదం :
కొంతమందికి తలనొప్పిగా ఉన్నప్పుడు టీ తాగుతారు. మరికొంతమంది ఆకలితో తలనొప్పి వస్తుందని నిమ్మరసం తాగుతారు. అలా తాగడం వల్ల తలనొప్పి వస్తుందని కొందరు అంటున్నారు. వీరు నిమ్మరసానికి ఎంత దూరంగా అంత బెటర్.
నాలికపై పగుళ్లు :
నిమ్మరసానికి నాలుకకు అవినాబావ సంబంధం ఉన్నట్లుంటుంది. కొన్నిరోజుల పాటు ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల నాలిక రుచి స్పందన పోతుంది. నాలుక మండుతుంది. అక్కడక్కడా పగుళ్లు ఏర్పడుతాయి. అసౌకర్యంగా అనిపిస్తుంది. దీంతో సరిగా మాట్లాడలేరు. ఇవి వారంపాటు అలానే ఉంటాయి.
చిగుళ్లక ప్రమాదం : చాకొటెట్లు, స్వీట్లు, తింటే పళ్లు పాడవుతాయని అంటుంటా కదా. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కూడా చిగుళ్లు పాడైపోతాయి. చాలామంది నిమ్మరసంలో షుగర్ కలుపుకొని తాగుతారు. ఆ షుగర్ అణువుల్ని చిగుళ్లపై ఉండే బ్యాక్టీరియా తింటుంది.
మూత్రాశయ వ్యాధులు :
నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే మూత్రాశయం అధికంగా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల దానిపై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా మూత్రాశయ వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తాయి.