రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు.. అని పెద్దలు చెబుతుంటారు కదా. అలాగే రోజుకోసారి యాపిల్ టీ తాగినా కూడా డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదట. యాపిల్ పండు తింటే ఎంత మంచిదో.. యాపిల్ టీ తాగితే కూడా అంతే మంచింది.
చాలామందికి యాపిల్ తినాలంటే తినబుద్ధి కాదు. పండు రూపంలో తినడం కన్నా.. లిక్విడ్ రూపంలో తినడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులోనూ టీ రూపంలో తాగడానికి ఇష్టపడుతారు. అటువంటి వాళ్లకు యాపిల్ టీ బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
యాపిల్ టీ తాగడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు… రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. శరీరంలోని ఇన్ ఫెక్షన్లను కూడా నివారించవచ్చు.
యాపిల్ టీని తాగడం వల్ల పొట్టలో పేరుకుపోయే ఎన్నో రకాల వ్యర్థాలను బయటికి పంపించవచ్చట. ఉదర సంబంధ సమస్యలన్నింటికీ.. యాపిల్ టీ చక్కని ఔషధమని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాదు.. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా కూడా యాపిల్ టీ తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుందట. అంతే కాదు.. యాపిల్ టీతో చర్మం కాంతివంతం అవుతుంది. యాపిల్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందం కూడా పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది.
మరి.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈరోజు నుంచే యాపిల్ టీ తాగడం మొదలు పెట్టండి. యాపిల్ టీని తయారు చేయడం కోసం మీరు తెగ కష్టపడాల్సిన అవసరం లేదు. బయట మార్కెట్ లో యాపిల్ టీ పౌడర్ దొరుకుతుంది. దాన్ని కొనుక్కుంటే చాలు. మీ ఇంట్లో యాపిల్ టీ ఉన్నట్టే లెక్క.