Lemon Leaves : మనం నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనం నిమ్మ ఆకుల గురించి పెద్దగా పట్టించుకోం. నిమ్మ ఆకులలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని దేశాలలో వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకుల రసాన్ని సువాసన ఏజెంట్ గా ఉపయోగిస్తారు. అలాగే తాజా రసం టీ గా కూడా తీసుకుంటూ ఉంటారు. నిమ్మ ఆకులను 5 తీసుకుని వేడి నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత వడకట్టి రెండు నెలలపాటు తీసుకుంటూ ఉంటే నిద్రలేమి, గుండె దడ, నరాల సమస్యలు తొలగిపోతాయి.
అలాగే మైగ్రేన్ తలనొప్పి, ఆస్తమా కూడా తగ్గుతాయి. నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రనాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాలలో రాళ్లను నివారిస్తుంది. సిట్రిక్ యాసిడ్ అనేది శరీరం పాస్పరస్ వంటి ఖనిజాలను శోషించటానికి సహాయపడుతుంది. నిమ్మ ఆకులలో కూడా విటమిన్ సి ఉంటుంది.
ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తాయి. నిమ్మ ఆకులలో ఉండే ఒక సహజసిద్ధమైన సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కనుక నిమ్మ ఆకులను తరచూ వాడాల్సి ఉంటుంది. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.