హెల్త్ టిప్స్

పురుషులు రొమాన్స్‌ను ఆస్వాదించాలంటే.. ఇలా చేయండి..!

పురుషులకు శారీరక శ్రమ అధికం. రోజులో ఎన్నో కష్టతరమైన పనులు చేస్తూంటారు. నిద్ర లేచిన వెంటనే ఉరుకులు, పరుగుల జీవితమే. ఉదయపు బిజినెస్ మీటింగ్ లనుండి అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీలవరకు శ్రమించాల్సిందే! మరి ఇంత బిజీ లైఫ్ కొరకు అధిక శక్తి నిచ్చే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పని చేసుకుపోవాలంటే…. మీరు తినే ఆహారంలో అధిక శక్తినిచ్చే పదార్ధాలు ఏమేమి వుండాలో పరిశీలించండి. అధిక శక్తినిచ్చే బ్రేక్ ఫాస్ట్: దీనిలో పాలు, అరటిపళ్ళు చేర్చండి. అరటిపండు లో శక్తి అధికం. తక్షణ శక్తి వస్తుంది.

ఇందులో పీచు పదార్ధం అధికం. ఐరన్ కూడా వుంటుంది. లేదా ఓట్స్ తినండి. ఇవి కూడా రోజంతా శక్తినిస్తాయి. నిదానంగా జీర్ణమవుతూ పొట్ట నిండేలా చేస్తాయి. బాదం పప్పులు, పిస్తాల వంటి ఎండు ఫలాలు తింటే బుగ్గల్లో కావలసినంత మెరుపు వస్తుంది. లంచ్: మధ్యాహ్న భోజనం తేలికగా వుండాలి. పెరుగుతో కూడిన కొన్ని సలాడ్లు తీసుకోండి. ప్రొటీన్లు అధికంగా వుండాలి. నీరు అధికంగా తాగండి. ఇది పగటిపూట శరీరం డీ హైడ్రేట్ కాకుండా చురుకుగా వుంచుతుంది.

men do like this to enjoy sexual life

డిన్నర్: డిన్నర్ ముందుగా సాయంత్రం తీసుకునే స్నాక్స్ లేదా చిరుతిండి చాలా లైట్ గా వుండాలి. అపుడే డిన్నర్ బాగా తీసుకోగలుగుతారు. డిన్నర్ లో తీసుకునే ఆహారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంత కాకపోయినా అదే మాదిరిగా వుండాలి. రాత్రి 8 గంటలకు డిన్నర్ పూర్తి చేస్తే, ఆహార ప్రయోజనాలు చక్కగా పొందగలరు. మెత్తగా ఉడికిన మాంసం, లేదా గోధుమ రొట్టెలు, పుల్కాల వంటివి దానితో బ్రక్కోలి కూర వంటివి తింటే శరీరంలో హ‌ర్మోన్‌ స్ధాయి పెరిగి ఎంతో హాయిగా వుండి రొమాన్స్ కు సిద్ధం చేస్తుంది.

Admin

Recent Posts