Natural Powder For Fat : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, తీపి పదార్థాలను ఎక్కువగా తినడం, మారిన జీవనశైలి వంటి వివిధ రకాల కారణాల చేత మనలో చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. శరీరంలో కొవ్వు పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
రెండు రకాల పనులను చేయడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. అందులో ఒకటి వ్యాయామం చేయడం అలాగే మరొకటి నిద్రపోవడం. నిద్రపోవడానికి మూడు గంటల ముందే తేలికపాటి ఆహారాన్ని తీసుకుని చక్కగా నిద్రపోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే నిద్రపోయే ముందు ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం మరింత సులభంగా బరువు తగ్గవచ్చు. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువును తగ్గించే ఈ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 50 గ్రాముల సోంపును, అర టేబుల్ స్పూన్ పసుపును, 25 గ్రాముల అవిసె గింజలను, 25 గ్రాముల జీలకర్రను, 25 గ్రాముల కరివేపాకు పొడిని, 25 గ్రాముల కరక్కాయ పొడిని, అర టేబుల్ స్పూన్ సైంధవ లవణం, 2 చిటికెల ఇంగువను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా కళాయిలో అవిసె గింజలను వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే జీలకర్ర, సోంపును కూడా విడివిడిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పదార్థాలను ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. దీనిని రాత్రి భోజనం చేసిన ఒక గంట తరువాత తీసుకోవాలి. మరిన్ని అద్భుత ప్రయోజనాల కోసం దీనిని ఉదయం, మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు.
తీసుకున్న ప్రతిసారి గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అలాగే దీనిని వాడినన్ని రోజులు ఎటువంటి జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. అలాగే ప్రతిరోజూ ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. ఇలా ఈ చిట్కాను పాటించడం వల్ల మనం మన శరీర బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.