ఆహారం పట్ల చాలామందికి కొన్ని భ్రమలుంటాయి. అవి దీర్ఘకాలంగా ప్రచారంలో వుండటం చేత వాస్తవాన్ని తెలుసుకోలేరు. వాటిలో కొన్ని ఎలాంటివో పరిశీలించి వాస్తవాలేమిటో తెలుసుకుందాం. వ్యాయామాలు చేసినంతకాలం మీరు ఏదైనా తినేయవచ్చు అనేది ఒక భ్రమ – మన శరీరం ఒక మెషీన్ లాంటిది. కనుక ఒక మెషీన్ తో పోలిస్తే, వాహనం ఎన్నాళ్ళు నడిపినా…ఏ ఇంధనమైనా పోయవచ్చు. కాని ఏది పోసినా వాహనం నడవదు. దానికవసరమైన నాణ్యతగల ఇంధనం కారును నడుపుతుంది. అదే విధంగా శరీరానికి తగిన నాణ్యతగల పదార్ధాలే తినాలి. అపుడే ఆరోగ్యం బాగుంటుంది.
డైటింగ్ చేస్తూ వుంటే వ్యాయామం అవసరం లేదనేది మరో భ్రమ – డైటింగ్ చేసే వారు కూడా వ్యాయామం చేయాలి. వ్యాయామం లేకుంటే, బాడీ సరైన రూపం సంతరించుకోదు. కారణం. వ్యాయామం లేకుంటే శరీరంలోని కొవ్వు కరగదు. తక్కువ బరువుంటే సన్నం…ఎక్కువ బరువుంటే కొవ్వు చేరినట్లు. ఇది మరో భ్రమ. క్రీడాకారుల శరీరాలు పరిశీలిస్తే, వారు సన్నగా వున్నప్పటికి బరువు అధికంగానే వుంటారు. వీరిలో కండలు అధికంగా వుండి బరువు కలిగిస్తాయి. కొవ్వు అనేది కండ లేకుండా శరీరంలో లూజుగా కూడా వుంటుంది. వెయట్ తక్కువున్నప్పటికి మీరు లావుగా కనపడతారు.
స్లిమ్ గా వుంటే ఫిట్ గా వున్నట్లే – ఇది కూడా భ్రమే. శరీరంలో వున్న కొవ్వు శాతం మీరు ఎంత సన్నగా వున్నారనేది చెపుతుంది. పేరొందిన మోడల్స్ సన్నగా వుంటారు. ఎందుకంటే వీరు ఆహారం సరిగా తీసుకోరు కాని వాస్తవంలో వీరిలో అధిక కొవ్వు శాతం వుంటుంది. వీరు తమ వృత్తి మానేస్తే చాలు బరువెక్కిపోతారు. కొవ్వు లేని ప్రత్యామ్నాయాలు బరువు తగ్గిస్తాయి. ఇది సరికాదు. కొవ్వుతక్కువగా వుండే షుగర్ లేని తిండ్లు, కొవ్వు తక్కువుండే పెరుగు వంటివి ఒక్కొక్కపుడు లావు చేయటమే కాదు, అనారోగ్యం కూడా కలిగిస్తాయి.