Orange Juice For Detox : మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తో ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణాశయంలో ఉండే మలినాలు తొలగిపోయి అవయవాలన్నీ శుభ్రపడతాయి. దీంతో మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలోని మలినాలను తొలగించే ఈజ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం క్యారెట్ ను, అల్లం ముక్కలను, నారింజ పండును, పెరుగును, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా నారింజలో ఉండే గింజలను తీసేసి వాటిని ముక్కలుగా చేసుకోవాలి.
ఈ ముక్కలను ఒక జార్ లో వేసుకోవాలి. తరువాత రెండు ఇంచుల అల్లం ముక్కను శుభ్రపరిచి ముక్కలుగా కట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి. అదే విధంగా ఒక పెద్ద క్యారెట్ ను కూడా ముక్కలుగా కట్ చేసి జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 150 ఎమ్ ఎల్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను కలిపి తాగాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. అవయవాలు శుభ్రపడతాయి. శరీరంలో రోగ ని\రోధక శక్తి పెరుగుతుంది.

జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఇలా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఈ విధంగా క్యారెట్ , నారింజ పండుతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.