హెల్త్ టిప్స్

ప్రోటీన్ల లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే స్థూల పోష‌కాల్లో ప్రోటీన్లు ఒక‌టి. మ‌నం తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. ఇవి కండ‌రాలు, ఎంజైమ్‌లు, చ‌ర్మం, హార్మోన్ల క్రియ‌ల‌కు అవ‌స‌రం అవుతాయి. శ‌రీర క‌ణ‌జాలాల ఏర్పాటుకు కూడా ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. శ‌రీరంలో ప్రోటీన్ల లోపం ఏర్ప‌డితే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మంది ప్ర‌జ‌లు ప్రోటీన్ల లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. వారిలో అధిక శాతం మంది ఆఫ్రికా, ద‌క్షిణ ఆసియా ప్రాంతాల‌కు చెందిన వారేన‌ని తేలింది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో ప్రోటీన్ల లోపం ఏర్ప‌డ‌కుండా అడ్డుకోవ‌చ్చు.

protein deficiency symptoms

పిల్లలు, వృద్ధులు, రోగులలో ప్రోటీన్ల లోపం సాధారణంగా కనిపిస్తుంది. ఈ లోపం ఉంటే ముఖం, చర్మం, జీర్ణాశ‌య‌ వాపు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. జుట్టు పొడిగా మారుతుంది. శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కండరాలు ఎముకల నుండి పోష‌కాల‌ను గ్రహించడం ప్రారంభిస్తాయి. పర్యవసానంగా ఎముకలు బలహీనంగా మారతాయి. ఒత్తిడికి గురై ఎముక‌ల్లో పగుళ్లు వ‌స్తాయి. ఎముక‌లు గుల్ల‌గా, పెళుసుగా మారి విరిగిపోతాయి. ప్రోటీన్ల లోపం ఉంటే ప‌రోక్షంగా ఎముక‌ల‌కు కూడా మంచిది కాదు. కనుక ఆ లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాలి.

ఇక ప్రోటీన్ల లోపం వ‌ల్ల‌ పిల్లల పెరుగుదల ఆగిపోతుంది. లేదా నెమ్మ‌దిగా జ‌రుగుతుంది. దీంతో వారు వ‌య‌స్సుకు త‌గిన ఎత్తు, బ‌రువు పెర‌గ‌రు. క‌నుక ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూడాలి. ఈ క్ర‌మంలోనే పాలు, ప‌నీర్‌, పెరుగు, నెయ్యి వంటి ఉత్ప‌త్తుల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా పొంద‌వ‌చ్చు.

అలాగే మాంసాహారులు అయితే చికెన్, చేపలు లేదా ఇత‌ర సీఫుడ్స్‌, మ‌ట‌న్ వంటివి తిన‌వ‌చ్చు. దీంతోపాటు సోయా, చిక్కుళ్లు, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, పెస‌లు, ప‌ప్పు దినుసులు వంటి ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో ప్రోటీన్లు బాగా అందుతాయి. ప్రోటీన్ల లోపం ఏర్ప‌డ‌దు. శ‌క్తి అందుతుంది. శ‌రీర నిర్మాణం స‌రిగ్గా జ‌రుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts