భారతీయ వంటలలో ఉపయోగించే మసాలా దినుసులలో లవంగం ఒకటి. లవంగాలు కేవలం వంటలకు రుచిని అందించడం మాత్రమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ లవంగాలను ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. మన శరీరానికి ఒక అద్భుతంలా పనిచేసే మసాలా దినుసుగా లవంగాలను భావిస్తారు. దీని శాస్త్రీయ నామం “సిజిజియం ఆరోమాటికం”. ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న లవంగాలను ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల కడుపులో ఏర్పడే కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా దంతాల నొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
చూడడానికి ఎంతో చిన్నవిగా కనిపించే లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. లవంగాలలో యూజినాల్ అనే మూలకం ఉంటుంది. దీనివల్ల అధిక ఒత్తిడి, కడుపులో ఏర్పడే మంట, అజీర్తి పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. సాధారణంగా లవంగాన్ని మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. కానీ నిద్రపోయే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో 2 లవంగాలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
* రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో 2 లవంగాలను తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. విరేచనాలు వంటి సమస్యలతో బాధపడేవారికి ఇదొక ఔషధంలా పనిచేస్తుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా పని చేస్తుంది.
* లవంగాలలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దంతాల నొప్పి సమస్యతో బాధపడేవారు గోరు వెచ్చని నీటితో లవంగాలను కలిపి తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* లవంగాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. అదేవిధంగా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే గొంతునొప్పి వంటి సమస్యల నుంచి కూడా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.
- కొందరిలో కాళ్ళు, చేతులు వణకడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ నిద్రపోయే ముందు లవంగాలతో నీటిని కలిపి తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
* క్రమం తప్పకుండా నిద్రపోయే ముందు లవంగాలతో నీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని ద్వారా జలుబు, దగ్గు, ఉబ్బసం మొదలైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365