Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

ఉసిరికాయలను తేనెలో నానబెట్టి రోజుకు ఒక‌టి తినండి.. ఈ 9 అనారోగ్యాలకు చెక్ పెట్టండి..!

Admin by Admin
November 23, 2021
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయ‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అలాగే ఈ కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్ర‌యోజ‌నాలు లభిస్తాయి. ఈ క్రమంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. అప్పుడు మన శరీరానికి ఇంకా ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, దాంతో ఎన్నో అనారోగ్యాలను కూడా త‌గ్గించుకోవ‌చ్చు. తేనెను, ఉసిరికాయలను కలిపి తిన‌డం వల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take amla and honey mixture everyday to get rid of these 9 health problems

ఒక సీసాను తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే సీసాలోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అనేక‌ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

1. తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కామెర్ల‌ వంటి వ్యాధులు ఉంటే త్వరగా త‌గ్గుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు, లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

2. వయస్సు మీద పడడం వల్ల చర్మం ముడతలుగా మారుతుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే ముడతలు తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా మారుతుంది. ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి.

3. చలి కాలంలో ఆస్తమా అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.

4. తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల‌ ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా ప‌నిచేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు ఎదుర‌య్యే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5. చలికాలం మన జీర్ణశక్తి త‌గ్గుతుంది. తిన్నది స‌రిగ్గా జీర్ణం కాదు. అందువ‌ల్ల‌ తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే జీర్ణ శ‌క్తి పెరుగుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు త‌గ్గుతాయి. ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది. ఆకలి పెరుగుతుంది. మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

6. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

7. తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది అధిక బ‌రువు ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.

8. తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పిల్లలు కలిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. అదే మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక పటుత్వం వృద్ధి చెందుతుంది. సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.

9. తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Tags: amlahoneyఉసిరితేనె
Previous Post

నరదిష్టి తొలగిపోవాలంటే ఈ అద్భుతమైన చిట్కా పాటిస్తే చాలు..!

Next Post

High BP : వీటిని రోజూ తీసుకోండి.. ఎంత‌టి హైబీపీ అయినా స‌రే.. వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!