Weight Gain : మనలో బరువు ఎలా తగ్గాలి అని బాధపడే వారితో పాటు బరువు ఎలా పెరగాలి అనే బాధపడూ వారు కూడా ఉన్నారు. అధిక బరువుతో కొందరు బాధపడుతుంటే బరువు పెరగడం లేదని కొందరు బాధపడతారు. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు ఎలా తలెత్తుతాయో ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువు ఉన్నా కూడా అదే విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు తక్కువగా ఉండడం వల్ల నీరసం, రక్తహీనత, అలసట, శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, తరచూ జబ్బుల బారిన పడడం వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ప్రకటనలకు ఆకర్షితులై చాలా మంది బరువు పెరగడానికి మార్కెట్ లో దొరికే పొడులను, టానిక్ లను వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.
అలాగే చాలా మంది బరువు పెరగడానికి కొవ్వు ఉన్న పదార్థాలను, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహారం ద్వారానే మనం సులభంగా బరువు పెరగవచ్చు. బరువు తక్కువగా ఉన్న వారు రోజు వారి ఆహారంలో భాగంగా ప్రతిరోజూ పాలను తాగాలి. పాలను తాగడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో పాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ పాలను తాగడం వల్ల మనం ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు.
అదే విధంగా బరువు పెరగాలనుకునే వారు రోజూ వారి ఆహారంలో ఎండు ద్రాక్షను తీసుకోవాలి. ఎండుద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి మన జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడతాయి. 8 నుండి 10 ఎండుద్రాక్షలను నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు లభించడంతో పాటు బరువు కూడా పెరుగుతారు. బరువు పెరగడంలో బాదం పప్పు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో శరీరానికి మేలు చేసే కొవ్వులతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. రోజూ 10 బాదం గింజలను నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పూట వీటపై ఉండే పొట్టు తీసి తినాలి.
ఇలా చేయడం వల్ల బాదం గింజలు చక్కగా జీర్ణమయ్యి వాటిలో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు తక్కువగా ఉండే వారు వీటిని తమ ఆహారంలో భాగంగా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అలాగే రోజూ 5 జీడిపప్పు పలుకులు తీసుకోవడం వల్ల కూడా చాలా సులభంగా, ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. వీటిని నీటిలో నానబెట్టాల్సిన పని లేదు. వీటిని నేరుగా తీసుకోవచ్చు. వీటిని నేరుగా తినలేని వారు ఈ డ్రై ఫ్రూట్స్ ను ఒక జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత వీటిని కాచిన పాలల్లో వేసి కలుపుకోవాలి. రుచి కొరకు తేనెను కలిపి ఈ పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా బరువు పెరుగుతారు. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండడం వల్ల ఏడు రోజుల్లోనే శరీర బరువులో వచ్చిన మార్పులను గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు.