Weight Gain : అధిక బరువు సమస్యతో బాధపడే వారు కొందరు అయితే ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండి బాధపడే వారు కొందరు. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు ఎలా అయితే వస్తాయో బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు తక్కువగా ఉండడం వల్ల రక్తహీనత, నీరసం, అలసట, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. చాలా మంది తాము ఎంత తిన్నా కూడా లావు అవ్వడం లేదని చెబుతుంటారు.
మనం తిన్న ఆహారం మన శరీరానికి పట్టినప్పుడు మాత్రమే మనం బరువు పెరుగతాము. మన జీర్ణశక్తి సరిగ్గా లేకపోయినా కూడా మనం తిన్నా ఆహారం మన శరీరానికి పట్టక మనం బరువు పెరగలేము. బరువు పెరగాలంటే ముందుగా మనం మన కండరాలను బలంగా మార్చుకుని శరీరంలో కొద్ది కొద్దిగా కొవ్వు పెరిగేలా చేసుకోవాలి. అలాగే మనం ఒకేసారి కూడా బరువు పెరగలేము. చాలా మంది త్వరగా బరువు పెరగాలని జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
మనం తినే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి తగిన పోషకాలను అందించడంతోపాటు మనం బరువు పెరిగేలా చేసే ఆహార పదార్థాల్లో ముందు వరుసలో ఉండేది ఎండు ఖర్జూర. దీనిలో మనకు అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. బరువు పెరగాలంటే ఎండు ఖర్జూరాన్ని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ లో కాచిన పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో 4 నుండి 5 ఎండు ఖర్జూరాలను, రెండు టీ స్పూన్ల పల్లీలను, ఒక టీ స్పూన్ ఎండు ద్రాక్షలను వేసి కలిపి ఒక పూట మొత్తం నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత ఆ పాలను తాగుతూ ఖర్జూరాలను, పల్లీలను, ఎండు ద్రాక్షలను తినాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేయడం వల్ల దాదాపుగా మనం 12 నుండి 14 కిలోల వరకు బరువు పెరుగుతాం.
ఇలా ఖర్జూరాలను తింటూనే ఒక కప్పు మొలకెత్తిన పెసలను మధ్యాహ్న సమయంలో తింటూ ఉండాలి. అలాగే ఉదయం పూట పండ్లను తీసుకోవాలి. అంతేకాకుండా మనం తినే ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే ఆరోగ్యవంతంగా మనం బరువు పెరగవచ్చు.