చాలా మందికి వారానికి లేదా పది రోజులకి పొట్ట సమస్యలు వస్తాయి. అది అజీర్ణం లేదా గ్యాస్ లేదా మలబద్ధకం వంటివి ఏవైనా కావచ్చు. పొట్ట శుభ్రంగా వుంచుకోవాలంటే…మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అనారోగ్యకర జీవనశైలి జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. పొట్ట శుభ్రత లేకుంటే పొట్ట బరువెక్కి మీరు లావుగా వున్నట్లుగా కూడా కనపడతారు. పొట్ట శుభ్రం చేసుకుంటూ జీర్ణక్రియ ఎప్పటికపుడు మెరుగుపరుచుకుంటూ పొట్ట పైకి కనపడకుండా లోతుగా వుండాలంటే ఏ ఆహారాలు తినాలనేది పరిశీలించండి.
కూరగాయలు – పచ్చటి ఆకుకూరలైన, బచ్చలి, తోటకూర, బ్రక్కోలి, బీన్స్, ములగ మొదలైనవి తేలికగా జీర్ణం అవుతాయి. కేరట్లు, ఉల్లిపాయ, బఠాణీ, బంగాళ దుంప వంటివి అధిక కార్బోహైడ్రేట్లు కలిగి పొట్టను శుభ్రం చేస్తాయి. పండ్లు – నిమ్మ జాతి పండ్లు పొట్టను శుభ్రం చేసి మలబద్ధకం లేకుండా చేస్తాయి. కనుక కమలా పండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, అరటిపండువంటివి మలబద్ధకాన్ని నివారిస్తాయి. రోజుకు కనీసం 2 అరటిపండ్లు తినాలి.
తృణ ధాన్యాలు – బియ్యం, గోధుమలు, రాగులు వంటివి తేలికగా జీర్ణం అవుతాయి. వీటిని తప్పక ఆహారంలో చేర్చండి. నీరు – నీరు ఆహారం కాకపోయినప్పటికి పొట్ట శుభ్రం చేయటానికి చాలా అవసరం. ఇది మలాన్ని మెత్తబడేసి తేలికగా బయటకు వచ్చేలా చేస్తుంది. ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి. ద్రవ ఆహారాలైన పండ్ల రసాలు, పాలు వంటివి కూడా తీసుకోండి.