Fast Food : సాధారణంగా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాలను, వంటకాలను తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు తక్కువగా రావడంతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికి మనం వెంటనే మరణించకుండా ఉంటాము. సమస్యలకు మందులు వాడుతూ మనం మన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. అయితే బయట లభించే జంక్ ఫుడ్, ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగాఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలియకపోగా మనం వెంటనే మరణిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో అకాలంగా మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. 15 నుండి 20 సంవత్సరాల మొదలు వయసు పైబడిన వారి వరకు అందరూ అకాల మరణానికి గురి అవుతున్నారు.
బయట లభించే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, సాఫ్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ( యుపిఎఫ్) వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల అకాల మరణానికి గురి అవుతున్నారని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువగా చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలోకి వెళ్తున్నాయని దీంతో మరణాలు సంభవిస్తున్నాయని వారు చెబుతున్నారు. అలాగే మార్కెట్ లో లభించే ప్యాకెజ్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, రెడీమెడ్ ఫుడ్స్ ను యొక్క రుచి పెంచడానికి అవి నిల్వ ఉండడానికి అనేక రకాల రసాయనాలు వాడతారు. ఈ రసాయానలన్ని ఆహార పదార్థాలకు జోడించడం వల్ల మరణాలు ఎక్కువవుతున్నాయని వారు తెలియజేస్తున్నారు. ఇలాంటి జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ ఎక్కువవుతున్నాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కవవుతున్నాయి. దీంతో అకాల మరణానికి గురి అవుతున్నారు.
కనుక మనం తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యసమస్యల కు గురి అయ్యేలా, అకాల మరణం బారిన పడేలా ఆహారాలను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడప్పుడూ పండగలకు, స్పెషల్ డేస్ లో, శుభకార్యాలకు తప్ప మిగిలిన రోజుల్లో మార్కెట్ లో లభించే ఆహారాలను తీసుకోకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఇటువంటి ఆహారాలను అస్సలు ఇవ్వకూడదని జంక్ ఫుడ్ ను ఇవ్వడం వల్ల వారి జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్లమవుతామని నిపుణులు హెచరిస్తున్నారు. కనుక ఇకనైన ఉప్పును తక్కువగా తీసుకోవడం, నూనెను తక్కువగా తీసుకోవడం, పంచదార కలిగిన పదార్థాలకు దూరంగా ఉండడం, ప్రాసెస్డ్ ఫుడ్ ను అస్సలు తీసుకోకపోవడం వంటివి చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.