డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. డెంగ్యూ తగ్గేందుకు పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు..!!

ఈ సీజన్‌లో సహజంగానే అనేక రకాల విష జ్వరాలు వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..

డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. డెంగ్యూ తగ్గేందుకు పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు..!!

డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. భరించలేని తలనొప్పిగా ఉంటుంది. తల బరువుగా అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పులు ఉంటాయి. కీళ్లు వాపులకు గురవుతాయి. నొప్పులు ఉంటాయి. వికారంగా అనిపిస్తుంది. కొందరికి వాంతికి వచ్చినట్లు ఉంటే కొందరికి వాంతులు అవుతాయి. కళ్ల మంటలు, కళ్ల చుట్టూ నొప్పి, శరీరంపై పొడలా ఎర్రని మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డెంగ్యూ వ్యాధి వచ్చాక లక్షణాలు బయట పడేందుకు 2 రోజుల సమయం పడుతుంది. డెంగ్యూ వచ్చాక చాలా మందికి ముందుగా జ్వరం వస్తుంది. అది 7 రోజుల పాటు ఉంటుంది. అయితే జ్వరం తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

డెంగ్యూ వచ్చిన వారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. పండ్ల రసాలను తీసుకోవాల్సి ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వారు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దోమలు ఇంకా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కనుక ముందు దోమలు లేకుండా చేయాలి. ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

డెంగ్యూ వ్యాధికి వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో దీన్ని వాతం వల్ల వచ్చే వ్యాధిగా చెప్పారు. దోమల్లో ఉండే విష పదార్థం మన శరీరంలోకి చేరి వ్యాధిని కలగజేస్తుంది. అందువల్ల వేపాకులు బాగా పనిచేస్తాయి. వీధి గుమ్మాలలో, ఇంటి ముఖ ద్వారంలో వేపాకులను అలంకరిస్తే ఇంట్లోకి దోమలు, వైరస్‌ రావు.

వేపాకులను సేకరించి శుభ్ర పరిచి వాటి నుంచి రసం తీయాలి. దాన్ని పూటకు ఒకటి లేదా రెండు టీస్పూన్ల చొప్పున రోజుకు మూడు సార్లు సేవించాలి. అలాగే వేపాకులను శరీరంపై చుట్టి 60 నిమిషాల పాటు ఉంచాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేయాలి. దీంతో వ్యాధి తగ్గుతుంది.

తులసి ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల అవి డెంగ్యూను తగ్గిస్తాయి. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కప్పు మోతాదులో రోజుకు మూడు సార్లు తాగాలి. డెంగ్యూ త్వరగా తగ్గుతుంది.

డెంగ్యూ వచ్చిన వారిలో ప్లేట్‌లెట్లు బాగా పడిపోతాయి కనుక వారు రోజుకు రెండు సార్లు పావు టీస్పూన్‌ చొప్పున బొప్పాయి ఆకుల రసం తాగాలి. ప్లేట్‌లెట్లు పడిపోకుండా ఉంటాయి.

మూడు పూటలా కొబ్బరినీళ్లను, పలుచని మజ్జిగను తీసుకుంటే హితకరంగా ఉంటుంది. జ్వరం తగ్గేవరకు ఘనాహారం మానేయాలి. ద్రవాహారమే తీసుకోవాలి.

ద్రాక్ష రసం రోజుకు మూడు సార్లు ఒక కప్పు మోతాదులో తాగాలి. అలాగే కప్పు పాలలో శొంఠి కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. చ్యవన్‌ప్రాశ్‌ లేహ్యం, ఉసిరిక చూర్ణంలను రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. గోరు వెచ్చని నీళ్లలో తేనె కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి.

ఈ విధంగా చిట్కాలను పాటిస్తూ, జాగ్రత్తలను తీసుకుంటే డెంగ్యూ త్వరగా తగ్గుతుంది. త్వరగా కోలుకుంటారు.

Admin

Recent Posts