Taking Foods : మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆహారం విషయంలో చాలామంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల తప్పులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకున్నా.. కొన్ని కాంబినేషన్స్ ని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. కొన్ని ఆహార పదార్థాలు ఒకదానికొకటి పడవు. చాలామందికి ఈ విషయం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు.
పాలు తాగిన వెంటనే పండ్లు తీసుకోకూడదు. పాలు తాగిన వెంటనే పండ్లు తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. సమస్యలు కలుగుతాయి. పాలల్లో ఉప్పు వేసుకుని తీసుకోవడం అసలు మంచిది కాదు. బ్రెడ్ తో పాటుగా పాలని తీసుకోకూడదు. పాలు తాగిన వెంటనే ఎటువంటి మాంసాహారం తీసుకోకూడదు. నెయ్యిని అస్సలు ఇత్తడి పాత్రలో వేయకూడదు. చల్లని, వేడి పదార్థాలను వెంట వెంటనే తినకూడదు. ఆరోగ్యం పాడవుతుంది.
చికెన్ తిన్న తర్వాత వెంటనే పెరుగు తినకండి. చేపలలో పంచదార వేసుకుని తీసుకోకూడదు. దోస, టమాట, నిమ్మకాయలని కలిపి తీసుకోకూడదు. మందు, పెరుగు ఒకేసారి తీసుకోకూడదు. పాలు, చేపలు, పెరుగుని కూడా ఒకేసారి తీసుకోకూడదు. పెరుగు, ఐస్ క్రీమ్ ని కూడా ఒకేసారి తీసుకోకూడదు. ఏదైనా మాంసం, చికెన్ ని కలిపి ఒకేసారి తినడం కూడా మంచిది కాదు.
ఉల్లిపాయ, పాలు ఒకే సారి తీసుకోకూడదు. అదే విధంగా పనసకాయ, పాలు ఒకేసారి తీసుకోకూడదు. మినప్పప్పు, పెరుగుని ఒకేసారి తీసుకోకూడదు. సిట్రిక్ యాసిడ్ ని, పాలని కలిపి ఒకేసారి తీసుకోకూడదు, ఇలా ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. చాలామంది తెలియక ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు. దాంతో ఆరోగ్యం పాడవుతుంది.