సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు మారుతూ వస్తాయి. ముఖ్యంగా మధ్య వయసు వారితో పోలిస్తే 40 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు వారిలో శారీరక, అభిజ్ఞ పనితీరుకు ఎంతగానో సహకరిస్తాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ, పురుషులు వారు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. వృద్ధాప్యం కారణంగా వారిలో వచ్చే వైకల్యం, ఇతర వ్యాధులను నివారించడానికి అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. టమోటాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే లైకోపీన్ అనే కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి టమోటాలకు ఎరుపురంగును ఇవ్వడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎదుర్కోవడానికి దోహదపడుతాయి.
2. వృద్ధాప్యంలో దృష్టిలోపం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విధమైన వ్యాధులను నివారించడం కోసం చిలగడ దుంపలు ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. చిలగడ దుంపలలో అధిక భాగం పొటాషియం, బీటా కెరోటిన్, ఫైటోకెమికల్స్ అధికంగా లభిస్తాయి. ఇవి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను రాకుండా చూస్తాయి.
3. గుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర పెరుగుదలకు, ఎముకలకు బలాన్ని పెంచడానికి, దీర్ఘకాలిక మంట, క్షీణత వ్యాధులను నివారించడానికి దోహదపడతాయి.
4. 40 సంవత్సరాలు పైబడిన వారు వారంలో రెండుసార్లు పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల వారి మెదడు పనితీరు పెరగడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది.
5. రోజ్ ఆపిల్ లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో టర్పానాయెడ్లు ఉండటం వల్ల మెదడు, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
6. నలభై ఏళ్లకు పైబడిన వారు నిత్యం బాదం పప్పును తీసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. వాపులు తగ్గుతాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
స్త్రీలు తీసుకోవలసిన ఆహార పదార్థాలు
* 40 ఏళ్లకు పైబడిన స్త్రీలలో సహజంగానే కాల్షియం లోపం వస్తుంటుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు గుల్లగా మారి విరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మహిళలు రోజూ పాలు తాగాల్సి ఉంటుంది. దీంతో కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చు.
* పెరుగులో అధికభాగం క్యాల్షియం, విటమిన్ బి12, రైబోఫ్లెవిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మహిళలలో ఎముకల సంబంధిత వ్యాధులు, రుతుక్రమం ఆగిన లక్షణాలను నివారించడానికి దోహదపడుతాయి.
* బచ్చలి కూరలో అధికభాగం విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను తొలగించి వృద్ధాప్యాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి.
* అవిసె గింజలలో అధికభాగం ఫైటో ఈస్ట్రోజెన్ లు, లెనోలేనిక్ ఆమ్లాలు, విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను, పునరుత్పత్తి ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
* బ్లూ బెర్రీస్ లో అధిక భాగం విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ ఉండటం వల్ల ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365