Warm Water : మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. మన శరీర బరువుకు, ఎత్తుకు అనుగుణంగా మనం నీటిని తాగాల్సి ఉంటుంది. తగనన్ని నీళ్లను తాగకపోయినా కూడా మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. నీరు తాగకపోవడం వల్ల అజీర్తి, మలబద్దకం, వేడి చేయడం, తలనొప్పి వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెతుత్తాయి. మనం ఎక్కువగా కొద్దిగా చల్లగా ఉండే నీటిని లేదా సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటిని తాగుతూ ఉంటాం. ఇలా సాధారణ నీటిని తాగడం కంటే వేడి నీటిని లేదా గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ వేడి నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల తలనొప్పి నుండి నెలసరి సమయంలో వచ్చే నొప్పుల వరకు దాదాపు అన్నీ నొప్పులు తగ్గుతాయి. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు కూడా తొలగిపోయి జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జుట్టు కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిని లేదా వేడి నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి.
అలాగే అకాల వృద్ధాప్యం వల్ల చర్మంపై వచ్చే ముడతలు తొలగిపోతాయి. అదే విధంగా వేడి నీటిని లేదా గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఉదయం పూట వేడి నీటిని లేదా గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు కొద్దికొద్దిగా వేడి నీటిని తాగుతూ ఉండడం వల్ల ఆయా సమస్యల నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది.
అంతేకాకుండా వేడి నీరు బరువు తగ్గడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఆహారం తరువాత వేడి నీటిని నేరుగా లేదా దానిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఈ విధంగా మనం ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.