Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బిగుతైన అండర్‌వేర్స్ ధరించడం వల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Admin by Admin
February 21, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జిహ్వకోరుచి అన్న చందంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రక రకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఎవరు ఏ రకం డ్రెస్ వేసుకున్నా అందరూ కామన్‌గా ధరించేది మాత్రం ఒక్కటే. అదే అండర్ వేర్. స్త్రీ, పురుషులెవరైనా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరిస్తారు. కొంత మంది అండర్‌వేర్‌ను ధరించరు లెండి. అది వారి స్వవిషయం. అలాంటి వారిని పక్కన పెడితే అసలు అండర్‌వేర్స్ వల్ల మనకు ఏ విధమైన నష్టాలు కలుగుతాయో, ఎలాంటి అండర్‌వేర్‌ను ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మరీ చిన్నవిగా ఉన్న అండర్‌వేర్స్‌ను ధరించకూడదు. మరీ పెద్దగా ఉండే థాంగ్స్ వంటి అండర్‌వేర్స్‌ను, సింథటిక్, సిల్క్ క్లాత్‌తో తయారు చేసిన అండర్‌వేర్స్‌ను ధరించకూడదు. ఇవన్నీ మనకు అపరిశుభ్రతను, అనారోగ్యాలను కలగజేస్తాయట. థాంగ్స్ వంటి అండర్‌వేర్‌తో ఈ-కోలి బాక్టీరియా సులభంగా వ్యాపించగలుగుతుందట. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యూరిన్ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయట. శారీరక శ్రమ లేదా వ్యాయామం అనంతరం చెమట పట్టిన అండర్‌వేర్‌ను అలాగే ధరించకూడదు. దాని స్థానంలో పొడి అండర్‌వేర్‌ను ధరించాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి.

what happens if you wear tight underwear

బాడీ షేప్ సరిగ్గా కనిపించడం కోసం కూడా పలు అండర్‌వేర్‌లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అయితే వీటిని ధరించడం కూడా అంతమంచిది కాదట. ఎందుకంటే ఇవి బాగా టైట్‌గా ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో చర్మం ఇర్రిటేషన్‌కు గురవుతుందట. ఇక మహిళలకైతే యోనిలో ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయట. కొంత మందిలో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయట. అధిక శాతం మందికి మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారుతుందట. స్త్రీలు రోజంతా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరించాలట. లేదంటే యోనిలో విడుదలయ్యే సహజసిద్ధమైన ద్రవాలకు రక్షణ ఉండదట.

నాణ్యమైన డిటర్జెంట్‌తోనే అండర్‌వేర్స్‌నుశుభ్రం చేసుకోవాలట. లేదంటే వాటిలో ఉన్న బాక్టీరియా, ఈస్ట్ వంటి క్రిములు అంత త్వరగా పోవట. వంద శాతం పూర్తి కాటన్‌తో తయారు చేసిన అండర్‌వేర్స్‌నే ధరించాలట. నైలాన్, పాలిస్టర్ వంటి ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన అండర్ వేర్స్ అయితే ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుందట.

Tags: underwear
Previous Post

మామిడి పండు తిని జీడి పారేస్తున్నారా.. ఈ సారి ఇలా చేసి చూడండి…

Next Post

మీ జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

Related Posts

హెల్త్ టిప్స్

నిద్ర లేచిన‌ వెంట‌నే త‌ల‌నొప్పిగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..

June 9, 2025
హెల్త్ టిప్స్

బ‌ల‌మైన కండ‌లు కావాలంటే ఈ ఆహారాల‌ను తినండి

June 9, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధిని వెన‌క్కి మ‌ళ్లించ‌వ‌చ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?

June 9, 2025
వైద్య విజ్ఞానం

ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

June 9, 2025
ఆధ్యాత్మికం

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

June 9, 2025
technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!