శరీరంలో వచ్చే వ్యాధులన్నిటికి కారణం జీర్ణవ్యవస్ధ సరిగా లేకపోవడమే. దీనిని మెరుగు పరచాలంటే శరీరాన్ని ఒకపూట ఆహారం లేకుండా చేయటమే నంటారు పోషకాహార నిపుణులు. శరీరం మొత్తంలోకి జీర్ణ వ్యవస్ధే అనేక సమస్యలకు గురవుతూంటుంది. కారణం – ఆ వ్యవస్ధను మనమే దుర్వినియోగం చేసేస్తుంటాం ! ఎలా ? రసాయనాలు వేసి నిలువ వుంచిన ఆహారాన్ని తినేసి శరీరంలో కృత్రిమ కణ విభజనకు దోహదం చేస్తాం.
రుచిగా వుంటే…అధికంగా భుజిస్తాం. రుచి లేకుంటే… కావలసినదానికంటే కూడా తక్కువే తింటాం… పార్టీల కెళితే, తక్కువ టైములో అనేక రకాల పదార్ధాలు తినేసి జీర్ణ శక్తికి తోడ్పడే ఎంజైములకు అసౌకర్యం కలిగిస్తాం. అంతే కాదు కలుప కూడని పదార్ధాలను కలిపేసి తినేస్తాం. ఉదాహరణకు – పాల ఉత్పత్తులను మాంసాహారంతో కలిపి, లేదా పుల్లని పదార్ధాలను పాలతో కలిపి జంక్ ఫుడ్ ను శీతల పానీయాలతో కలిపి తినేస్తాం.
మన బాడీ క్లాక్ ఆదేశాల మేరకు జీర్ణక్రియలో అవసరమైన ఎంజైములు రిలీజ్ అయినప్పటికి మనకు సమయం ఉన్నపుడు తింటాం, సమయం లేనపుడు మానేయటం చేస్తాం. ఈ ఎంజైములు లేకుంటే జీర్ణ శక్తి కష్టమే మరి! పైన పేర్కొన్న టిప్స్ ఆచరిస్తూ మీకు ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తే, జీర్ణ వ్యవస్ధకు హాని కలుగదని, ఆరోగ్యం సరిగా ఉంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.