ప్రస్తుత తరుణంలో పురుషులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన సమస్యలు రెండు ఉన్నాయి. అవి ఒకటి.. పొట్ట దగ్గర కొవ్వు, రెండు జుట్టు రాలిపోవడం. వీటి వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన 3 రకాల సులభమైన వ్యాయామాలను రోజూ చేస్తే ఆ రెండు సమస్యల నుంచి బయట పడవచ్చు. పొట్ట పూర్తిగా తగ్గిపోవడమే కాక జుట్టు పెరుగుతుంది. బట్టతల రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ మూడు వ్యాయామాలు ఏమిటంటే..
1. గుంజీలు
గుంజీలు తీయడం. దీన్నే స్క్వాట్స్ అంటారు. రోజూ 3 సెట్ల మేర గుంజీలు తీయాలి. ఒక్క సెట్‌కు 15 స్లారు స్క్వాట్స్ చేయాలి. దీంతో శరీరం కింది భాగంలోని కండరాలు దృఢంగా మారుతాయి.
2. బరువులు ఎత్తడం
ఈ వ్యాయామాన్ని జిమ్‌లో చేయవచ్చు. లేదా బరువులను కొనుగోలు చేస్తే ఇంట్లోనే చేయవచ్చు. కానీ మొదట్లో నిపుణుల పర్యవేక్షణ అవసరం. దీన్ని సరిగ్గా చేయాలి. ఈ వ్యాయామాన్ని రోజూ చేస్తే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
3. చెస్ట్ ప్రెస్
ఇది కూడా బరువులు ఎత్తే వ్యాయామమే. కాకపోతే వెల్లకిలా పడుకుని చేయాలి. దీని వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. హార్మోన్లు సమతుల్యం అవుతాయి.
ఈ మూడు వ్యాయామాలను చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరగడమే కాక జుట్టు కూడా పెరుగుతుంది.