Women Fitness : స్త్రీ మరియు పురుషుడి శరీరతత్వంలో అనేక వ్యత్యాసాలు ఉంటాయి. ఇది మనందరికి తెలిసిందే. వాటిలో బరువు పెరగడం, తగ్గడం కూడా ఒకటి. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలు త్వరగా బరువు పెరుగుతారు. అలాగే బరువు తగ్గే విషయంలో కూడా ఈ వ్యత్యాసం ఉంటుంది. బరువు తగ్గడానికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బరువు పెరగడం ఇద్దరికి కూడా హానికరమే. వయసు, ఎత్తును బట్టి బరువు ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే బరువు పెరుగుతాము. ఇలా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి స్త్రీలు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషుల కంటే మహిళలు వేగంగా బరువు పెరుగుతారు. యుక్త వయసులో ఉండే అమ్మాయిలు మరింత వేగంగా బరువు పెరుగుతారు.
కానీ యుక్త వయసులో ఉండే అబ్బాయిలు బరువు తక్కువగా ఉంటారు. యుక్తవయసులో శరీరంలో కొవ్వు పదార్థం 30 నుండి 40 శాతం ఉంటుంది. అయినప్పటికి యుక్తవయసులో ఉండే అమ్మాయిలు లావుగా ఉంటారు. దీనికికారణంస్త్రీలల్లో జీవక్రియ తక్కువగా ఉండడమే. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలల్లో జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఇద్దరు శారీరక శ్రమ సమానంగా చేసినప్పటికి స్త్రీల్లలో క్యాలరీలు తక్కువగా ఖర్చు అవుతాయి. కనుక స్త్రీలు బరువుతగ్గడానికి మరింత ఎక్కువగా వ్యాయామం చేయాలి. అలాగే పురుషులు, స్త్రీల్లలో కొవ్వు నిల్వలు, కొవ్వు పంపిణీ సామర్థ్యం వేరుగా ఉంటుంది. పురుషుల్లో నడుము చుట్టూ ఉండే భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అదే స్త్రీలల్లో నడుము, తొడల భాగంలో కొవ్వు పేరుకుపోతుంది.
స్త్రీలల్లో తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు చాలా మొండిగా ఉంటుంది. ఈ కొవ్వు అంత త్వరగా కరగదు. కనుక స్త్రీలు ఎక్కువగా వ్యాయామం చేయాల్సి వస్తుంది. అలాగే కొవ్వును కరిగించడంలో కండరాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే స్త్రీలతో పోల్చినప్పుడు పురుషుల్లో కండరాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత కూడా స్త్రీలు త్వరగా బరువు తగ్గరు.