సినిమాల్లో హీరోయిన్ల బికినీ ప్రదర్శన… వారికి స్లిమ్ ఫిగర్ అంటూ… హై రేటింగ్ తెచ్చిపెడుతుంది. చెమటలు కారే ఎండలైనా…వణుకులు పుట్టించే చలైనా సరే, నేటి రోజుల్లో అందాలు ప్రదర్శించాలనుకునే స్త్రీలకు బికిని డ్రస్ ఒక వరంగా మారింది. శరీరంపై అతితక్కువ గుడ్డ…. రెండే రెండు చిన్న గుడ్డముక్కలుండే ఈ బికిని వేయాలంటే మహిళలు బాడీలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అపుడే అనుకున్న రీతిలో హై రేటింగ్ స్లిమ్ ఫిగర్ గా వారు మార్కులు పొందగలరు. ప్రధానంగా స్తనాలు, పొట్ట, నడుము, తొడలు ఆకర్షణీయంగా కనపడాలి. అందుకుగాను స్త్రీలు తినవలసిన బికిని డైట్ ఎలా వుండాలో చూడండి.
బికిని బ్రేక్ ఫాస్ట్ – ఆహారంలో రెండు ఆమ్లెట్ లు, అతి తక్కువ కొవ్వు కల మాంసం బ్రెడ్ తో, కొవ్వు లేని పాలు చిన్న బాటిల్, మిక్సెడ్ ఫ్రూట్స్ ప్లేటు నిండా వుండాలి. కొవ్వు తక్కువగా వుండే భోజనం – ఎంత తిన్నా…10 అంగుళాల ప్లేటులో పట్టే ఆహారమే తినాలి. కొద్దిపాటి బఠాణీల వంటివి లేదా మాంసం ఒక కప్పు. వివిధ రకాల కూరగాయలు సలాడ్ చేసుకొని తినండి. కూరలు, మాంసం వంటివి ఒక కప్పు మించకుండా తినండి. సాయంత్రం తిండి – తక్కువ కేలరీల స్నాక్స్. ఇందులో ఆపిల్, పుచ్చకాయ లేదా బెర్రీల వంటి పండ్లు తినండి. ఇవి చురుకుగా వుంచుతాయి. పొట్ట కూడా నిండుతుంది. ఈ పండ్లలో నీరు అధికం. కేలరీలు తక్కువ.
రాత్రి భోజనం – తేలికగా జీర్ణం అయ్యేవిగా వుండాలి. నెయ్యి, లేదా వెన్న మీగడ వంటివి ఒక టీస్పూను వేసుకోవాలి. సుమారుగా చిన్న బాటిల్ అంటే 300 మి.లీ. పాలు కూడా తాగండి. ఈ ఆహారం తింటూ తగిన వ్యాయామాలు చేస్తే చక్కని బరువు నియంత్రణతో మీరు ఆసించే స్లిమ్ ఫిగర్ తేలికగా పొందే అవకాశంవుంది. వ్యాయామాలే కాక, ఇంటిపని అయిన, దుమ్ము దులపటం, మాపింగ్, కార్ వాషింగ్, లేదా తోటపని వంటివి కూడా మీలోని అధిక బరువు తగ్గించటానికి తోడ్పడతాయి. అవకాశముండి…సన్ బేతింగ్ కూడా చేస్తే కండరాలు బలపడతాయి.