ప్రతి ఒక్కరి జీవితంలో రోజువారీ కార్యకలాపాలలో స్నానం చేయడం ఒకటి. రోజూ స్నానం చేయడం వల్ల పరిశుభ్రంగా ఉండవచ్చు. అయితే కొందరు రోజూ స్నానం చేయరు. మానేస్తుంటారు. దీని వల్ల ఎలాంటి ప్రమాకరమైన సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
స్నానం చేయకపోతే గజ్జల్లో బాక్టీరియా, ఫంగస్ పేరుకుపోతాయి. దీంతో అక్కడ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎక్కువ రోజులు స్నానం చేయకపోతే అక్కడ మురికి ఏర్పడి దురద వస్తుంది. ఇన్‌ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. స్నానం రోజూ చేయకపోతే చర్మ సమస్యలు వస్తాయి. బాక్టీరియా, ధూళి పేరుకుపోతాయి. చర్మంపై గీతలు, మచ్చలు ఏర్పడతాయి.
రోజూ స్నానం చేసినప్పుడు చర్మం ఉపరితలంపై ఉండే మృత చర్మ కణాలు బయటకు పోతాయి. దీంతో కొత్త వాటి పునరుత్పత్తికి మార్గం సుగమం అవుతుంది. స్నానం చేయడం మానేసినప్పుడు, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి. దీంతో శరీరమంతా మృతకణాలు ఉంటాయి. అవి అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవు. స్నానం చేయడం మానేస్తే శరీరంపై బాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు పేరుకుపోతాయి. దీంతో జలుబు, హెపటైటిస్ ఎ వంటి సమస్యలు వస్తాయి.