జ్వ‌రం వెంట‌నే త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

జ్వ‌రం వ‌చ్చిందంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో జ్వ‌రం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అది డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్.. ఏదైనా కావ‌చ్చు. జ్వ‌రం వ‌స్తే బాగా నీర‌సంగా మారుతారు. శ‌క్తిని కోల్పోతారు. కోలుకునేందుకు 4-5 రోజులు ప‌డుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే జ్వ‌రం నుంచి వేగంగా కోలుకోవ‌చ్చు. త్వ‌ర‌గా శ‌క్తిని పుంజుకుంటారు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

జ్వ‌రం వెంట‌నే త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

1. జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో తుల‌సి ఆకులు బాగా ప‌నిచేస్తాయి. ఇవి స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బయోటిక్ లా ప‌నిచేస్తాయి. వీటితో జ్వ‌రం వేగంగా త‌గ్గుతుంది. 20 తుల‌సి ఆకుల‌ను తీసుకుని ఒక పాత్ర‌లో నీటిలో వేసి బాగా మ‌రిగించాలి. త‌రువాత వ‌చ్చే నీటిని ఒక కప్పు మోతాదులో తాగాలి. దీన్ని గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగాలి. పూట‌కు ఒక‌సారి తాగుతుంటే జ్వ‌రం వేగంగా త‌గ్గుతుంది.

2. తుల‌సి ఆకులు, అల్లం వేసి మ‌రిగించిన నీటిని కూడా తాగ‌వ‌చ్చు. దీంతో కూడా జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

3. మ‌నం రోజూ కూర‌ల్లో వాడే వెల్లుల్లిలో యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది. ఇందుకు గాను 2 వెల్లుల్లి రెబ్బ‌లను తీసుకుని బాగా న‌లిపి ఒక క‌ప్పు వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని తాగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

4. అల్లంలోనూ యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉంటాయి క‌నుక అల్లంను తీసుకున్నా జ్వ‌రం త‌గ్గుతుంది. పూట‌కు 1 టీస్పూన్ అల్లం ర‌సాన్ని భోజనానికి ముందు తాగాలి. లేదా చిన్న అల్లం ముక్క‌ను తురిమి ఆ మిశ్ర‌మాన్ని నీటిలో వేసి బాగా మ‌రిగించి అనంత‌రం వ‌చ్చే నీటిని తాగాలి. అందులో తేనె క‌లిపి తాగ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 2 సార్లు తాగితే జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

5. జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో కొత్తిమీర ఆకులు కూడా బాగానే ప‌నిచేస్తాయి. కొత్తిమీర ఆకుల‌ను బ్లెండ‌ర్‌లో వేసి జ్యూస్ తీసి దాన్ని పూట‌కు 2 టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి. లేదా కొత్తిమీర ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించ‌గా వ‌చ్చే నీటిని కూడా తాగ‌వ‌చ్చు. ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగాలి. దీంతో జ్వ‌రం నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

6. ద్రాక్ష‌ల్లో యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉంటాయి. క‌నుక జ్వ‌రం వ‌చ్చిన వారు ద్రాక్ష‌ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు.

7. అర టీస్పూన్ జీల‌క‌ర్ర పొడి, అర టీస్పూన్ సోంపు గింజ‌ల పొడిని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగుతుండాలి. జ్వ‌రం త‌గ్గుతుంది.

Admin

Recent Posts