Lemon : నిమ్మకాయ.. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని కూడా మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మకాయలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిమ్మకాయలను ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నిమ్మకాయను ఏవిధంగా ఉపయోగించాలి.. నిమ్మకాయను వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయల నుండి తీసిన రసాన్ని మనం సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం.
ఈ నిమ్మరసాన్ని వేడి నీటిలో కలుపుకుని తాగడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున వేడి నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. నిమ్మలో మినరల్స్, న్యూటియన్స్ అధికంగా ఉంటాయి. అవి మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. నిమ్మ ఉదరాన్ని శుభ్రపరిచి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపిస్తుంది. ఇది మన శరీరంలో ఉన్న మలినాలను, వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో సహజ సిద్ద ఔషధంగా పని చేస్తుంది. వేడి నీటిలో నిమ్మరసంతో పాటు తేనె, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కలిపి తీసుకుంటే మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వీటన్నింటితో పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిమ్మకాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక నిమ్మకాయ ముక్కలను, అల్లం ముక్కలను, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసి మరో 10 పదా నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ పానీయం చల్లగా అయిన తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ఉదయం పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ పానీయాన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి న్యూమోనియా వరకు అన్ని రకాల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నిమ్మ యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ వైరల్ గా పని చేస్తుంది. ఇది అంతర్గతంగా దాగి ఉన్న రోగాలను కూడా తగ్గిస్తుంది. ఈ పానీయాన్ని తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. దీనిని తరచూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా దీనిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఈ విధంగా నిమ్మకాయతో పానీయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల చక్కటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని ఈ పానీయాన్ని తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.