Honey Lemon Juice : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలలో తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగడం కూడా ఒకటి. చాలా మంది బరువు తగ్గడానికి తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగుతుంటారు. తేనె, నిమ్మరసం నీటిని తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వేసవి కాలంలో తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగడం వల్ల పెద్ద ప్రేగు శుభ్రపడుతుంది. కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఉండే వాపులను తగ్గించడంలో కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ నీటిని తాగుతుంటారు. అయితే కొందరికి తేనె, నిమ్మరసాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి.. ఈ నీటిని ఎప్పుడు తాగాలి.. అన్న సందేహాలు వస్తుంటాయి. తేనె, నిమ్మరసాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటికి గాను ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో చిటికెడు పసుపును వేసి కలిపి తాగడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనెను, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ విధంగా తేనె, పసుపు, నిమ్మరసాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల మూత్రాశయం శుభ్రపడుతుంది. చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.