దేశంలో కరోనా విజృంభిస్తోంది. అత్యంత వేగంగా కోవిడ్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలా మంది రోగ నిరోధక శక్తి పెరిగేందుకు రక రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కింద తెలిపిన బీట్ రూట్ స్మూతీ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు
- బీట్‌రూట్ – 1
- టమాటాలు – 2
- నిమ్మకాయ – 1
తయారు చేసే విధానం
బీట్‌రూట్‌ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. టమాటాల్లో విత్తనాలను తీసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తరువాత బీట్‌రూట్, టమాటా ముక్కలను మిక్సీలో వేసి స్మూతీలా అయ్యే వరకు గ్రిండ్ చేయాలి. తరువాత వచ్చే స్మూతీని గ్లాస్‌లో పోసి అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండి బాగా కలపాలి. తరువాత ఆ స్మూతీని తాగేయాలి. దీన్ని రోజుకు 2 సార్లు తాగవచ్చు.
పైన తెలిపిన బీట్‌రూట్ స్మూతీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీట్‌రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కనుక ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. హైబీపీ తగ్గుతుంది. బీట్‌రూట్‌లలో ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి ఉంటాయి. అందువల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవుతుంది.
బీట్‌రూట్‌లలో పొటాషియం, విటమిన్ బి, ఇ, ఇతర పోషకాలు ఉంటాయి కనుక శరీర కణజాలం దెబ్బ తినకుండా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365