Categories: ఆహారం

ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌నిచ్చే అవ‌కాడో.. ఈ విధంగా తిన‌వ‌చ్చు..!

ఒక‌ప్పుడు కేవ‌లం ధ‌నికులు మాత్ర‌మే అవ‌కాడోల‌ను తినేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇవి అంద‌రికీ అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా వీటిని తిన‌వ‌చ్చు. అయితే వీటిని ఎలా తినాలో, ఏం చేసుకోవాలో కొంద‌రికి అర్థం కాదు. అలాంటి వారు కింద తెలిపిన విధానాల్లో అవ‌కాడోల‌ను తిన‌వ‌చ్చు. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయి.

avocado benefits in telugu

అవ‌కాడోలు, అర‌టిపండ్లు, వాల్‌న‌ట్స్ క‌లిపి స్మూతీలా చేసుకుని వాటిని తీసుకోవ‌చ్చు. లేదా కోడిగుడ్ల‌తో క‌లిపి వండుకుని తిన‌వ‌చ్చు. అందులో అవ‌స‌రం అనుకుంటే చీజ్ కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇక ఇవేకాకుండా అవ‌కాడోల‌ను చియా సీడ్స్‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు. లేదంటే శ‌న‌గ‌ల‌తో క‌లిపి వండుకుని తిన‌వచ్చు. అలా కాక‌పోతే చికెన్ క‌బాబ్‌ల‌తో అయినా క‌లిపి తిన‌వ‌చ్చు. ఎలా తిన్న‌ప్ప‌టికీ అవ‌కాడోల‌తో మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి.

అవ‌కాడోల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. దృష్టి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు ఉండ‌వు. మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో శ‌రీరంలో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌యి బ‌రువు త‌గ్గుతారు. అవ‌కాడాల్లో ఉండే ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) జీర్ణ స‌మ‌స్య‌లను త‌గ్గిస్తుంది. ఇలా అవ‌కాడోలతో అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts