వేపాకులతో మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలను ఆయుర్వేద పరంగా పలు వ్యాధులను నయం చేయడం కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా వేప పండ్లతో ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పైల్స్ సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు వేప పండ్లను తింటుంటే ఆ సమస్య నుంచి వెంటనే బయట పడవచ్చు.
2. జీర్ణాశయం, పేగుల్లో పురుగులు ఉన్నవారు వేప పండ్లను రోజూ ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. దీంతో పురుగులు చనిపోతాయి.
3. మూత్రాశయ సమస్యలు ఉన్నవారు, ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు రోజూ వేప పండ్లను ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తింటుంటే సమస్య తగ్గుతుంది.
4. వేప పండ్లను తింటుండడం వల్ల ముక్కు నుంచి కారే రక్త స్రావం తగ్గుతంది. కంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు పెరుగుతుంది.
5. షుగర్ ఉన్నవారు వేప పండ్లను తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
6. గాయాలు, పుండ్లపై వేప పండ్ల గుజ్జును రాస్తూ కట్టు కడుతుండాలి. దీంతో అవి త్వరగా మానుతాయి.
7. వేప పండ్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
8. రోజూ వేప పండ్లను తింటుంటే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
9. వేప పండ్ల గుజ్జును ముఖానికి రాసి కొంత సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
10. వేప పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
అందుకనే తినగ తినగ వేము తియ్యనుండు.. అనే పద్యాన్ని కూడా కవి రాశారు. తింటుంటే తింటుంటే వేప పండ్లు కూడా తియ్యగా అనిపిస్తాయి. వాటి వల్ల అనేక లాభాలు కలుగుతాయి.