Turmeric : భారతీయులందరూ ఎంతో పురాతన కాలం నుంచి పసుపును ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ మనం వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. పసుపును ఔషధంగా కూడా ఎంతో కాలం నుంచి వాడుతున్నారు. అయితే పసుపుతో ఎలాంటి వ్యాధులను నయం చేసుకోవచ్చో చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే పసుపుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, జింక్, విటమిన్లు సి, ఇ, కె లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పసుపును పోషకాలకు గనిగా చెప్పవచ్చు. కనుక పసుపును రోజూ తీసుకుంటే శరీరానికి పోషణ లభిస్తుంది. వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. కరోనా బారిన పడినవారు ఈ విధంగా తాగితే కరోనా నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ మిశ్రమం ఎన్నో సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది.
3. కొద్దిగా పసుపును తీసుకుని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి మోకాళ్లపై రాయాలి. రాత్రి పూట ఈ విధంగా చేసి కట్టు కట్టాలి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.
4. ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలిపి తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. పసుపును కొద్దిగా తీసుకుని అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి పూట మొటిమలపై రాయాలి. మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖం కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే మొటిమలు మొత్తం తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది.
6. పసుపును ఫేస్ మాస్క్‌లా కూడా ఉపయోగించవచ్చు. కొద్దిగా పసుపు తీసుకుని అందులో తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని గంట సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం అందంగా మారుతుంది.
7. పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని గాయాలు, దెబ్బలు, పుండ్లపై రాసి కట్టు కడుతుండాలి. దీంతో అవి త్వరగా మానుతాయి. అలాగే చర్మంపై దద్దుర్లు, దురదలు కూడా తగ్గిపోతాయి. ఫంగస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
8. పసుపు, కొబ్బరినూనె, ఉప్పులను సమాన భాగాల్లో తీసుకుని కలిపి మిశ్రమంలా చేయాలి. దీంతో దంతాలను తోముకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల నోటి సమస్యలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి.
9. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ అల్లం రసం కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాల పాటు దేన్నీ తీసుకోకూడదు. ఇలా చేస్తుంటే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది.