గుండె పోటు వచ్చిందంటే ఎంతో ఆందోళన. ఏ చిన్న అసౌకర్యం గుండెలో ఏర్పడినప్పటికి దానికి గుండె జబ్బుగానో పోటు గానో భావించి చాలామంది ఖంగారు పడిపోతారు. వివిధ ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ రోగ నిర్ధారణకై వెళుతూంటారు. గుండె పోటు కలిగిన వ్యక్తికి లక్షణాలు ఎలావుంటాయో పరిశీలించండి.
గుండెపోటు వచ్చినపుడు ఛాతీలో నొప్పి విపరీతంగా కలిగి మెలిపెట్టినట్టు వుంటుంది. ఆ సమయంలో విపరీతమైన నచెమట పడుతుంది. వాంతి వచ్చే భావన కలిగి వుండటం లేదా ఒక్కోసారి వాంతి అవడం కూడా జరుగుతుంది. కళ్ళు బైర్లు కమ్ముతూ వుంటాయి. కాళ్ళు, చేతులు చల్లబడి, చల్లని భావన కలుగుతుంది. గుండె కొట్టుకోవడంలో ఆగి ఆగి కొట్టుకుంటున్నట్లు కొద్దిపాటి తేడా కనపడుతుంది.
గుండెపోటు నివారించాలంటే ఏ రకమైన చర్యలు చేపట్టాలి? పొగతాగటం మానాలి. రక్తపోటును ఎల్లపుడూ నియంత్రించుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్ధాయి నియంత్రించాలి. అధిక బరువు ఎక్కకుండా నియంత్రించాలి. సిఫారసు చేసిన లిపిడ్ స్ధాయిలను మెయిన్టెయిన్ చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం, ఆహారం వంటివి ఆచరిస్తూ ఒత్తిడిని తగ్గించుకుంటూ వుండాలి.